ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా పార్లమెంటు సభ్యునిగా రాహుల్ గాంధీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా తెలంగాణ ఎజెండాతో మే 7న జరిగే మేధోమథన సదస్సుకు వస్తే తప్పేమిటని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తెలంగాణ ఉద్యమ కారుడు డాక్టర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలోని తన చాంబర్లో మాట్లాడుతూ… తెలంగాణ సమాజంలో 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనార్టీ మహిళలకి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో తమ వాటా తమకు దక్కలేదనే ఆవేదన తెలంగాణ ప్రజల్లో ఉందని, నీళ్లు నిధులు నియామకాలు గత ఎనిమిది ఏళ్లలో అనుకున్న స్థాయిలో జరగలేదని.. అందుకే ప్రతి వర్గం ఈరోజు తెలంగాణలో తమ వాటా కోసం పోరాటం చేస్తుందని ఈ దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక భూమిక పోషించిందని, గడ్డపై మేధోమథన సదస్సు పార్టీ జెండా లేకుండా తెలంగాణ ఎజెండాతో జరిగితే తమలాంటి వాళ్ళము తప్పకుండా స్వాగతిస్తామని …అన్ని రాజకీయ పార్టీ నేతలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సదస్సులకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత రాహుల్ గాంధీ ఓయూకు వచ్చి తన అభిప్రాయాలను మేధావులతో పరిశోధక విద్యార్థులతో పంచుకుంటే తప్పేమిటని… విశ్వవిద్యాలయాలు భవిష్యత్ భారతదేశాన్ని నవ తెలంగాణ నిర్మించాలంటే అనేక ఆలోచనలు సంఘర్షణ పడాలని ఆ దిశగా రాహుల్ సందేశము ఉస్మానియా విద్యార్థులకు ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు.