మానవ హక్కులపై అవగాహన అత్యావశ్యకం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

సమాజంలోని ప్రతి ఒక్కరికీ మానవ హక్కులపై అవగాహన కలిగించవలసిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులు పౌరులందరూ సద్వినియోగం చేసుకునేలా వ్యవస్ధలు బలపడాలన్నారు. విజయవాడ రాజ్ భవన్ లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ ను కలిసిన మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021 – 22 వార్షిక నివేదికను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ హక్కుల పరిరక్షణలో కమీషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మానవ హక్కుల కమీషన్ చైర్మన్‌ జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, జ్యుడిషియల్‌ సభ్యులు దండే సుబ్రహ్మణ్యం, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులు డాక్టర్‌ శ్రీనివాసరావు గోచిపాత, గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, కమీషన్ కార్యదర్శి ఎస్‌ వి. రమణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు. కమీషన్ సభ్యుడు శ్రీనివాసరావు రచించిన కంబాటింగ్‌ కరప్షన్‌ ఇన్‌ ఇండియా – రోల్‌ ఆఫ్‌ యాంటీ కరప్షన్‌ ఏజెన్సీస్‌ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా గవర్నర్ కు బహుకరించారు.

Leave a Reply