వ్యవసాయం సంక్షోభం వైపు పోతుందా? భవిష్యత్ తరాలు నిత్యవసర వస్తువులు కొనగల స్థితిలో ఉంటారా? మొదటి తరం రైతులు ముఖ్యంగా అగ్రకులాలు వ్యవసాయం మానేశారు అనుకోవాలి.రెండోతరం సన్నకారు రైతులు, కౌలు రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో పరిశోధనలు లేకపోవడం, ప్రభుత్వాల నిర్లక్ష్య ఓట్ల గుంజుకునే విధానాలతో వ్యవసాయం తీవ్ర సంక్షోభం వైపు పోతుంది అనుకోవాలి.
కొత్త కొత్త తెగుళ్లతో పంటలు ఎండిపోవడం బయట తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతే ఆహార సంక్షోభం వస్తుంది.మనందరం వ్యవసాయం తాలూకా సమస్యలు పరిష్కార మార్గాలు ఇంకా వ్యవసాయం లాభసాటి కి తీసుకోవాల్సిన తాత్కాలిక, దీర్ఘకాలిక విధి విధానాల గురించి మేధోమథనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాం. వ్యవసాయ నిపుణులు, బాధిత రైతులు, రాజకీయ నాయకులు, పాత్రికేయ మిత్రులు,అధికారులు, యువత ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను.వ్యవసాయం తాలూకా సమగ్ర సమాచారం తెలుసుకునే అవకాశం కోసం మేధోమథన సదస్సులో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.
మీ
నేతి మహేశ్వర రావు ,
ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ పోరం