Suryaa.co.in

Andhra Pradesh

మానవ హక్కుల కమీషన్ కు లేఖ రాసిన వర్ల రామయ్య

పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడి వేణుగోపాల్ పై దాడి చేసిన సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమీషన్ కు లేఖ రాసిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

• 2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది.
• పోలీసులే బాధితులపైన దాడులు, వేధింపులు, అధికార దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు.
• తాజాగా సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో బాధితుడి వేణుగోపాల్ పై ఎస్.ఐ దాడి చేయడం కొంతమంది పోలీసుల దుర్మార్గపు చర్యలకు నిదర్శనం.
• హిందూపురం అసెంబ్లీలోని సజీవరాయనపాలెంకు చెందిన బీసీ మహిళ పద్మావతి చాలా ఏళ్లుగా వికలాంగుల పింఛను పొందుతున్నారు.
• ఆమె తమ పార్టీకి అనుకూలంగా లేదని వైసీపీ నాయకులు ఆమె పెన్షన్‌ను తొలగించారు.
• పెన్షన్ తొలగించడాన్ని ప్రశ్నించిన ఆమె కుమారుడు వేణుగోపాల్ పై వైకాపా నాయకుడు దామోదర్ రెడ్డి అతనిపై దాడి అక్రమ కేసు పెట్టారు.
• జరిగిన వాస్తవాలను లిఖితపూర్వకంగా పిర్యాదు చేసేందుకు స్టేషన్ కు వెళ్లిన వేణుగోపాల్ పై చిలమత్తూరు ఎస్.ఐ రంగడు అసభ్యంగా దుర్భాషలాడుతూ మరలా దాడి చేశారు.
• బాధితుడిని మరింత బాధించడం అత్యంత దుర్మార్గం.
• ఎస్.ఐ తీరు రాజ్యాంగం ప్రసాధించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమే.
• ఇది ఏపీ పోలీస్ మాన్యువల్‌కు కూడా పూర్తి విరుద్ధం.
• నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో ఎస్.ఐ రంగడు ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు.
• కాబట్టి వేణుగోపాల్ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన ఎస్.ఐ రంగడుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాను.

LEAVE A RESPONSE