– పదో తరగతి పరీక్షలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం
– విద్యార్థుల భవిష్యత్ ను ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేస్తున్నా అసమర్థత మంత్రులు
– గత టీడీపీ ప్రభుత్వం లోని ఫీజు రియంబర్స్మెంట్ ను వైకాపా పేరు మార్చి అమ్మవడి పథకంగా నామకరణం చేసుకున్నారు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి
రాయచోటి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆర్.శ్రీనివాస రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ప్రజలను పచ్చి మోసం చేశాడు అని ప్రభుత్వం పై ధ్వజమెత్తారు.పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చాడు ఈ రోజు ఏ ఒక్క హామీని కూడా ఎక్కడా కూడా అమలు చేసిన దాఖలాలు లేవు అని విమర్శించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం 100% హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ వాస్తవానికి చూస్తే ఏ ఒక పథకం కూడా పూర్తిగా అమలుకాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని అన్నారు.గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టితే ఈ ప్రభుత్వంలో పేరు మార్చి అమ్మ ఒడి అమలు చేశారు అని అన్నారు.
గత ప్రభుత్వంలో 15 వేల రూపాయల నుంచి 22 వేల రూపాయల వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది.అది కూడా ఒకేసారి ఇచ్చే వాళ్ళము అని అన్నారు.ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఫీజు రియంబర్స్మెంట్ ను నాలుగు విడతగా ఇస్తున్నారు అని విమర్శించారు.విద్యా దీవెన కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అనేకమంది అనర్హులుగా తేలారంటూ సర్కార్ నోటీసులు జారీ చేయడం విడ్డురంగా ఉంది అని అన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిధికి మించి ఇంటి విస్తీర్ణం కలిగి ఉన్నారని, ఆ ఇంటిలో మోటర్ సైకిల్ ఉంది అని, కారు ఉంది అని, ఇంటి కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అని, లేదా ఆధార్ కార్డు పాన్ కార్డు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డులో పేర్లు మ్యాచ్ అవడం లేదని, ఇంటిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రవేటు ఉద్యోగం లో వున్నారు అని అనేక రాకలుగా సాకులు చూపి విద్యార్థులను అనర్హులుగా భావించడం నియంత పాలనకు నిదర్శనం అని అన్నారు.
ఒక పక్క విద్యార్థులకు పీజు రియంబర్స్మెంట్ రాకపోవడం, మరొక పక్క చూస్తే ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని చెల్లించాలని వత్తిడి చేస్తుంటే ఆ విద్యార్థులు అనేక రకాలుగా ఒత్తిడికి గురి అవడమే కాకుండా, వారి చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని అన్నారు.గత టీడీపీ ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవ్వగా జగన్ రెడ్డి ప్రభుత్వం దానిని 10.97 లక్షల మంది విద్యార్థులకు కుదించారు అని అన్నారు.
దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను దూరం చేసి విద్యార్థుల భవిష్యత్ నాశనం చేశాడు.విద్యా దీవెనను విద్యార్థుల దగాగా మార్చారు అని విమర్శించారు.తక్కువ ఖర్చు పెట్టి ఏదో ఎక్కువగా చేసినట్లు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ పెద్ద పెద్దయాడ్లతో ప్రజలను మాయ చేసే ఆర్భాట ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు.
పేద విద్యార్థులకు విదేశీ విద్యానిధి పథకంను రద్దు చేశారు. దాని వల్ల ఒక్కొక్క విద్యార్థి రూ.10 లక్షలు కోల్పోయారు.ఉన్నత విద్యానిధి పథకం రద్దు చేశారు దాని వల్ల పోటీ పరీక్షలకు హాజరయ్యే పేద విద్యార్థులకు శిక్షణ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం రద్దు చేశారు దాని వల్ల 2 లక్షల మందికి అన్యాయం జరిగింది.నిరుద్యోగ భృతి రద్దు చేయడం వల్ల 6 లక్షల మంది విద్యార్థులు తమ భృతిని కోల్పోయారు.బాలికలకు సైకిళ్ల పంపిణి రద్దు చేశారు దాని వల్ల రూ.3,600 విలువ గల సైకిల్ ఒక్కొక్క విద్యార్థి కోల్పోయారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు రద్దు దాని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను కోల్పోయారు.మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు.. రద్దు చేశారు.తెలుగుదేశం హయాంలో రెండు డీఎస్సీలు నిర్వహించి 16,828 మంది నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలిచ్చాం అని అన్నారు.
అదే జగన్ రెడ్డి ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీనిచ్చి రెండేళ్లైనా ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు అని విమర్శించారు.పదోతరగతి పరీక్షలు కూడా సమర్ధవంతంగా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు.వైకాపా మంత్రులు, వైకాపా నాయకుల బరితెగింపుతో పదోవ తరగతి ప్రశ్నపత్రం లీకు కు విద్యార్థులు, ఉపాధ్యాయులు బలికావాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.
వాట్సావ్ గ్రూపులుక్రియేట్ చేసి వైసీపీ జాతిరత్నాలు వైసీపీయువజనం పేరుతో వైసీపీవారే పదోతరగతి పరీక్షాపత్రాలను లీక్ చేయడం దారుణమైన అంశం అని విమర్శించారు.ప్రశ్నపత్రాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా లీక్ చేయడం.. విద్యార్థుల జీవితాలను కాలరాయడమే అని అన్నారు.జగన్ మోహన్ రెడ్డి బాటలోనే నడుస్తున్న వైకాపా నాయకులు, చివరకు విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి, జేబులు నింపుకునే ప్రయత్నాలు చేయడంసిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.