– మీడియా స్వేచ్ఛలో నార్వే నెంబర్ వన్
-పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్ ర్యాంక్ 150
– 157వ స్థానంలో నిలిచిన పాకిస్థాన్
– రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ తాజా నివేదిక
– అంటే జర్నలిస్టు సంఘ నేతలవన్నీ ఉత్తుత్తి అరుపులేనా ?
అక్క ఆర్భాటమే తప్ప బావబతికుంది లేదన్నట్లు… పత్రికా స్వేచ్ఛ గురించి జర్నలిస్టు యూనియన్ లీడర్లు మైకులు విరగ్గొడమే తప్ప, వాస్తవ ంలో మన దేశంలో పత్రికాస్వేచ్ఛ పెద్దగా లేనేలేదట. నాలుగవ స్తంభమని చెప్పుకోవడమే తప్ప, నిజానికి ఆ స్తంభం స్వేచ్ఛ లేక
నలిగిపోతోందట. అవును. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ నివేదికలో మన స్వేచ్ఛ గురించి నగ్నసత్యాలు బయటపెట్టింది. పత్రికా స్వేచ్ఛ విషయంలో నార్వే నెంబర్ వన్ స్థానంలో ఉందట. మరి మనపాలకులు నార్వేను చూసి ఎప్పుడు నేర్చుకుంటారో? కాకపోతే.. పక్కనున్న పాకిస్తాన్తో పోలిస్తే.. మన దేశంలో పత్రికాస్వేచ్ఛ మెరుగేనట. అదొక్కటే ఊరట. మిగిలినదంతా ‘షేమ్ టు షేమ్’. అదేదో చూద్దాం రండి.
పత్రికా స్వేచ్ఛ సూచిలో మన దేశం ఏమాత్రం మెరుగ్గా లేదు. నానాటికీ తీసికట్టుగా పరిస్థితి తయారైందని తాజా అధ్యయనం వెల్లడించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) తాజాగా ప్రకటించిన దేశాల జాబితాలో మన దేశం 150వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ ర్యాంక్ 142. ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్లకు ఉన్న స్వేచ్ఛను.. అలాంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ హైలైట్ చేస్తుంది. జర్నలిజానికి ‘చెడు’గా పరిగణించబడే దేశాల జాబితాలో భారత్ గతేడాది చేర్చబడింది.
జర్నలిస్టులపై జరుగుతున్న హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, కేంద్రీకృత మీడియా యాజమాన్యం.. ఇవన్నీ భారత్లో పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిణమించాయని ఆర్ఎస్ఎఫ్ నివేదిక పేర్కొంది.
‘ఇండియా స్పెండ్’ నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ షట్డౌన్, తప్పుడు సమాచారం విస్త్రృత వ్యాప్తి కూడా గత ఐదేళ్లలో పత్రికా స్వేచ్ఛ సూచికలో భారతదేశం ర్యాంక్ పడిపోవడానికి కారణమని వెల్లడించింది. కాగా, పత్రికా స్వేచ్ఛ సూచిలో నార్వే మొదటి స్థానంలో నిలవగా.. పాకిస్థాన్ 157వ స్థానంలో ఉంది.
ఇప్పుడు చెప్పండి జోక్స్ మ్యాగజైన్లు నడిపే జర్నలిస్టు యూనియన్ కామ్రేడ్స్… వాట్ టు.. వాట్ నాట్ టుడు?!