– తెలంగాణలో బీజేపీ వికాశించబోతుంది
– కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అయింది
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
‘‘అది తెలంగాణ రాష్ట్ర సమితి కాదు. తెలంగాణ రజాకార్ల సమితి. తెలంగాణలో ప్రజల జోష్ చూస్తుంటే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. కేసీర్కు కాళేశ్వరం ఏటీఎంగా మారింది. తెలంగాణకు మోదీ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయ’’ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దా వ్యాఖ్యానించారు. మహబూబ్నగర్లో జరిగిన జనం గోస-బీజేపీ భరోసా బహిరంగసభకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నద్దా ఏమన్నారంటే..
ఇక్కడ సభలో చూస్తే… మీలో జోష్ కనిపిస్తోంది. తెలంగాణ లో బీజేపీ వికాశించబోతుంది. దుబ్బాక, హుజురాబాద్ విజయాలతో కేసీఆర్ కు దిమ్మతిరిగింది. తెలంగాణ లో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే.బండి సంజయ్ పాదయాత్ర కు ప్రజల ఆశీర్వాదం ఉంది. మోడీ ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎప్పుడూ ఉంటాయి…ఉన్నాయి కూడా. మోడీ ది బాధ్యత కలిగిన ప్రభుత్వం. కరోనా సమయంలో అమెరికా, జెర్మనీ, ఫ్రాన్స్ ఏమీ చేయలేకపోయాయి. అదే సమయంలో ప్రజల సహకారం తో కరోనాను ఎదుర్కొన్నాం. 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదే.
కరోనా నియమ నిబంధనలు పాటించని కేసీఆర్… అదే సమయంలో కరోనా నిబంధనల పేరుతో బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు.పేద ప్రజల కోసం కేంద్రం 5 కిలోల బియ్యం, గోధుమలు, పప్పు ఉచితంగా ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అయింది… పాలిచ్చే గేదె(బర్రె) అయింది.
తెలంగాణ లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తే…. డబుల్ లాభం అవుతుంది.హరితహారం లో అవినీతి, ల్యాండ్ మాఫియా…. ఇలా ఎన్నో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు… తెలంగాణ రాజాకార్ సమితి అది. కేంద్ర నిధులతో… కేంద్ర పథకాలను… తన పథకాల పేరుతో అమలు చేసుకుంటున్నాడు. బండి సంజయ్ పాదయాత్రను చూస్తే… ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం గా అర్థం అవుతోంది.
దున్నపోతుకు గడ్డేస్తే… ఆవు పాలిస్తుందా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఒక విచిత్రమైన పరిస్థితి తెలంగాణ లో ఉంది. 5 సంవత్సరాలు పరిపాలించేందుకు కేసీఆర్ కు ప్రజలు అవకాశం ఇస్తే… ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రజలను అవ మానపర్చాడు. దుబ్బాక, హుజురాబాద్ లో trs కు ప్రజలు బుద్ధి చెప్పారు పాలమూరు గడ్డ నుంచి బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పాలమూరు లో బీజేపీ ఎమ్మెల్యే ను గెలిపించారు. పాలమూరు కు బీజేపీ కి అవినాభావ సంబంధం ఉంది. ఫార్మ్ హౌజ్ లో ఉన్న ముఖ్యమంత్రి కి ఎన్నికలంటే భయమేస్తోంది. పుత్ర వాత్సల్యం తో కొట్టుమిట్టాడుతున్నారు. కేసీఆర్, ఒవైసీ కుటుంబాల చేతిలో తెలంగాణ తల్లి బందీ అయింది. తెలంగాణ కేబినెట్ లో ఉద్యమకారులు లేరు… తెలంగాణ ద్రోహులు మాత్రమే ఉన్నారు. ప్రగతి భవన్ కు వెళ్లాడానికి ప్రజలకు పర్మిషన్ ఉండదు… ఎంఐఎం నేతలకు మాత్రం ప్రగతి భవన్, ఫార్మ్ హౌజ్ కు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఎగిరేది కమళం జెండానే. తెలంగాణ గడ్డ బీజేపీ అడ్డా. ఒవైసీ తలకిందులుగా తపస్సు చేసినా… trs ను కాపాడలేరు.తెలంగాణ ప్రజలు trs ను బొంద పెట్టబోతున్నారు. దున్నపోతుకు గడ్డేస్తే… ఆవు పాలిస్తుందా? కేసీఆర్…. నీ ఫ్రంటులు, టెంటులు ఏమయ్యాయి? కేంద్రాన్ని బదనం చేయడమే కేసీఆర్ లక్ష్యం. వరి విషయంలో ఢిల్లీ వచ్చి డ్రామాలు చేసాడు… గంటలో ధర్నా ముగించాడు. Trs మోసపూరిత మాటలను నమ్మకండి. బీజేపీ అధికారంలోకి వస్తే… తెలంగాణ ప్రజా భవన్ గా మారుస్తాం.