– రివర్స్ టెండరింగ్ చేశాను…అన్నిసమస్యలకు అదే జిందా తిలిస్మాత్ పరిష్కారమన్న జగన్ రెడ్డి, ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్మాణంపై రెండుచేతులు పైకెత్తి, రాష్ట్రరైతాంగాన్ని నట్టేటముంచాడు
• డయాఫ్రమ్ వాల్, ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడుతమచేతుల్లో ఏమీలేదంటున్నవారు, గతంలో ఎవరి అనుమతితో రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు?
• సెంట్రల్ విజిలెన్స్ నిబంధనలు మార్చిమరీ పాతటెండర్లురద్దుచేసి, కొత్తటెండర్లు ఎందుకుపిలిచారు?
• రివర్స్ టెండరింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ జరిపి ఎన్నికోట్లు ఆదాచేశారు?
• డయాఫ్రమ్ వాల్ నిర్మాణంసహా, 36నెలల్లో ఈప్రభుత్వం పోలవరంలో చేసినపనులు.. టీడీపీప్రభుత్వంలో జరిగిన పనులపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము జగన్ రెడ్డికి ఉందా?
• డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ రెడ్డి మూర్ఖపు, అహంకారపూరిత నిర్ణయాలే కారణం.
• పోలవరానికి బాగా వరదలు వచ్చే సమయంలోనే కాంట్రాక్ట్ సంస్థను ప్రాజెక్ట్ సైట్ లో లేకుండా ఎందుకు చేశాడో జగన్ రెడ్డి చెప్పాలి?
• తనఅసమర్థత, చేతగానితనంతో జాతీయప్రాజెక్ట్ కు తీరనిద్రోహంచేసిన వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు.
– మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించిన ఇరిగేషన్ మంత్రి ఎప్పుడో పూర్తవుతుందో..ఎప్పుడు నీళ్లిస్తామోచెప్పలేమనడం చూస్తుంటే ప్రాజెక్ట్ నిర్మాణపనులు, డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఆయనకు అవగాహనలేదని తేలిపోయిందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన వివరాలు ఆయన మాటల్లోనే …
పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయప్రాజెక్ట్. సదరుప్రాజెక్ట్ పనులు టీడీపీ హాయాంలో చంద్ర బాబుగారి నాయకత్వంలో 70శాతంవరకు పూర్తయ్యాయి. గతంలో రాష్ట్రజలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినవ్యక్తి పోలవరంనిర్మాణం గురించి, ఇతరఅంశాల గురించి తననేమీ అడగ ద్దంటున్నాడు. ఇప్పుడు జలవనరులమంత్రిగా ఉన్నవ్యక్తేమో గోదావరినదిపై పులిచింతల బ్యారేజీకట్టామని, పోలవరంపై బ్యారేజీకడుతున్నామంటూ మాట్లాడి తనఅజ్ఞానాన్ని చాటు కున్నాడు.
టీడీపీప్రభుత్వంలోపోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి జరిగిన పనులకు కేంద్ర ప్రభుత్వ విభాగమైన సీబీఐపీ వారిపర్యవేక్షణలో కేంద్రఇంధనశాఖమంత్రిగారు బెస్ట్ ఇంప్లిమింటేషన్ ప్రాజెక్ట్ అవార్డ్ అందించారు. 24 గంటల్లోనే 32,515 క్యూబిక్ మీటర్లకాంక్రీట్ వర్క్ తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పోలవరం ప్రాజెక్ట్ స్థానంసంపాదించింది చంద్రబాబుగారి హాయాంలోనే . అలాంటిప్రాజెక్ట్ నిర్మాణానికి 2019లో వైసీపీఅధికారంలోకి వచ్చినప్పటినుం చీ గ్రహణం పట్టింది.
పోలవరం ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రిస్థానంలో జగన్మోహన్ రెడ్డి తొలిసారి సమీక్షచేసినప్పుడు చాలాస్పష్టంగా జలవనరులశాఖాధికారులు కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం గురించి చేయాల్సిన పనులు, జరిగిన పనులు గురించి వివరించారు. వారు చెప్పింది అంతావిన్న ముఖ్యమంత్రి, తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కువచ్చాక రెండునెలలకే పనులుచేస్తున్నకాంట్రాక్ట్ సంస్థలను పొమ్మని, జరుగుతున్న పనులన్నింటినీ రద్దుచేసేశాడు.
జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డికి బంధువైన ఆర్ అండ్ బీ రిటైర్డ్ ఇంజనీర్ అయిన పీటర్ ఆధ్వర్యంలో కమిటీవేశారు. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తెలివితక్కువ ముఖ్యమంత్రి, వేలకోట్ల అవినీతిజరిగిందంటూ రివర్స్ టెండరింగ్ జరిపాడు. జగన్ రెడ్డి తన అహంకారపూరిత నిర్ణయాలు పక్కన పెట్టాలని, ప్రాజెక్ట్ పనులు చేస్తున్న ఏజెన్సీలపై ఎలాంటి ఫిర్యాదులులేవని, తొందరపాటు నిర్ణయాలతో రివర్స్ టెండర్లు జరపొద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీసీఈవో నెత్తీనోరు కొట్టుకున్నాడు.
అయినాకూడా ఈముఖ్యమంత్రి తాను పట్టిన కుం దేటికి మూడేకాళ్లన్నట్లుగా మూర్ఖత్వంతోవ్యవహరించాడు. ప్రాజెక్ట్ పనులుచేస్తున్న కంపెనీల టెండర్లు ఫైనల్ అవ్వడానికి గతంలో నాలుగేళ్ల సమయంపట్టిందని, 4ఏళ్లజాప్యంతో, రూ.2,500కోట్లవరకునిర్మాణవ్యయంపెరిగిందని, పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు ఓకే అయ్యి, ఎంపికైన కాంట్రాక్ట్ సంస్థలు రంగంలోకిదిగి, అంతాచక్కబడి పనులుసజావుగా జరుగుతున్న సమయంలో ఇలాంటిపనులు చేయద్దని కేంద్రంతగదన్నా, తొందరపాటు నిర్ణయాలువద్దని మొత్తుకున్నా ఈ చేతగాని ముఖ్యమంత్రి పెడచెవిన పెట్టాడు.
ఎవరేం చెప్పినా వినకుండా ముఖ్యమంత్రి గతంలోపనులుచేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలను సాగనంపి, పీటర్ కమిషన్ నివేదికను ఆధారంగాచేసుకొని, రివర్స్ టెండరింగ్ కు వెళ్లాడు. 29జూలై 2019న ప్రీక్లోజర్ వర్క్స్ అన్నింటినీ టెర్మి నేట్ చేస్తున్నట్లు కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చాడు. జాతీయప్రాజెక్ట్ అయిన పోలవరంపనులు రద్దుచేసే అధికారం ఈ ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు? రివర్స్ టెండరింగ్ డ్రామాలుఆడి, టెండర్లలో రెండుకంపెనీలు పాల్గొనాల్సి ఉండగా, ఒకకంపెనీకే పనులుకట్టబెట్టి, రివర్స్ టెండర్ ను, రిజర్వ్ టెండర్ గా మార్చి, 2019 నవంబర్ లో మీరు అనుకున్న కొత్తకంపెనీకి పనులు కట్టబెట్టారు.
ఆ వ్యవహారమంతా అలాఉంచితే , నిన్న ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన మంత్రి 2019-20లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అంటున్నాడు. మరి కొత్తగా ప్రాజెక్ట్ నిర్మా ణపనులు అప్పగించినసంస్థకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణపనుల్లో తప్పిదంజరిగినా.. డ్యామ్ కునష్టంజరిగినా మీదే బాధ్యతని ముందేచెప్పారా?
డయాఫ్రమ్ వాల్ నిర్మాణంసహా, ప్రాజెక్ట్ పై గోబెల్స్ ప్రచారం చేయకుండా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తక్షణమే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 10,11 సమావేశాల సమాచారం బయటపెట్టాలి. ఇప్పటికే నావద్దఉన్న మినిట్స్ సమాచారాన్ని మీడియావారికి ఇచ్చాను. ప్రాజెక్ట్ నిర్మాణంపై మీడియా వాస్తవాలు వెల్లడిస్తుంటే, చేతగాని ప్రభుత్వం, గోబెల్స్ మంత్రి ప్రతిపక్షంపై నిందలేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ తాలూకా పవర్ ప్రాజెక్ట్ ని కొట్టేయాలన్న దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, జాతీయప్రాజెక్ట్ నిర్మాణంలో జాప్యంజరిగేలా చేశాడు. పోలవరంలో జరుగుతున్న అపశ్రుతులకు, పనులజాప్యానికి పూర్తిబాధ్యుడు జగన్మోహన్ రెడ్డే . ఇప్పుడు మంత్రిగా ఉన్నవ్యక్తే గతంలో ఎమ్మెల్యేలకమిటీలో సభ్యుడిగా ప్రాజెక్ట్ సంద ర్శనకు వెళ్లినప్పుడు డయాఫ్రమ్ వాల్ కట్టామని చెబుతున్నారు..ఎక్కడకట్టారో కనిపించడం లేదంటూ మాట్లాడారు. మంత్రిగా నిన్న ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన అదేవ్యక్తి 2019-20 లోవచ్చిన వరదలకే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అంటున్నాడు.
పాత టెండర్లు రద్దుచేసి, కొత్తటెండర్లు పిలిచేటప్పుడుగానీ, 10,11 పోలవరం అథారిటీ మినిట్స్ లో గానీ పోలవరం పనుల్లో జాప్యంజరిగితే ఎవరు బాధ్యతవహిస్తారని గానీ … డిఫెక్ట్ మేనేజ్ మెంట్ కు ఇబ్బందులువస్తే ఎవరు బాధ్యతవహిస్తారని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాష్ట్రప్రభుత్వాన్నిప్రశ్నిస్తే, అన్నిప్రశ్నలకు, అన్నిసమస్యలకు ఒకటేమందు ‘జిందా తిలిస్మాత్’ అన్నట్టుగా జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ సమయంలో మాట్లాడాడు. రివర్స్ టెండరింగ్ చేశాను…అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
ప్రాజెక్ట్ కి కచ్చితంగా జూలైనుంచి నవంబర్ మధ్యన దాదాపు 50లక్షలక్యూసెక్కుల వరద వస్తుంది. ఆసయమంలోనే ఈముఖ్యమంత్రి, అసమర్థప్రభుత్వం కాంట్రాక్ట్రర్ లేకుండా చేసింది. చేతగాని దద్దమ్మ పనులు చేయబట్టే, తుగ్లక్ నిర్ణయాలుతీసుకోబట్టే, 2019లో 15లక్షల క్యూసెక్కులవరద, 2020లో 19క్యూసెక్కుల వరదవచ్చింది. ఏకపక్షనిర్ణయాలతో రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, తొందరపాటుగా వ్యవహరించబట్టే, ప్రాజెక్ట్ నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ఇవేవీఆలోచించకుండా గవర్నర్ ప్రసంగంలో 2023లో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని ఎలాచెప్పించారు?
పార్లమెంట్ లో కేంద్ర మంత్రితో 2022లో పూర్తిచేస్తున్నట్లు ఎలా సమాధానంచెప్పించారు? వారితో అలాచెప్పించనవారే, నిన్నమాట్లాడుతూ డ్యామ్ డిజైన్ రివ్యూకమిటీ.. పోలవరంప్రాజెక్ట్ అథారిటీ సూచనలప్రకారమే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేస్తామంటున్నారు. వాళ్లఅనుమతి లేకుండా పనులుచేయలేమని ఇప్పుడు చెబుతున్నవారు.. గతంలో ఎవరినిఅడిగి రివర్స్ టెండరింగ్ డ్రామాలుఆడారు? మీ చేతగానితనంతో నిర్వాసితులను గాలికొదేలేశారు. వారికిదక్కాల్సిన సొమ్ముని వైసీపీనేతలు, ఆపార్టీ ఎమ్మెల్యేలు పందికొక్కుల్లాతినేస్తున్నారు.
గిరిజనులకుదక్కాల్సిన పరిహారాన్ని మంత్రి, ప్రాజెక్ట్ పరీవాహకప్రాంతంలోని స్థానికవైసీపీఎమ్మెల్యేలు పందికొక్కుల్లా దిగమింగు తున్నా ముఖ్యమంత్రి ఎందుకు నోరుతెరవడంలేదు? ఇరిగేషన్ మంత్రి తనపార్టీవారిని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు? నిర్వాసితులుసొమ్ము తినే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? పోలవవరంనిర్వాసితులకు న్యాయంచేయాలంటూ మాజీఎమ్మెల్యే వంతల రాజేశ్వరి నిరాహారదీక్ష చేసేవరకు ఈప్రభుత్వంఏంచేసింది? పోలవరంనిర్వాసితులు తమకున్యాయంచేయండి అంటూ అధికారులను చుట్టూముట్టినా ప్రభుత్వంలోచలనంలేదు. పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లిన జలవనరులమంత్రి నిర్వాసితులవద్దకెళ్లి, వారికి న్యాయంచేసేదిశగా, వారిసమస్యలు పరిష్కరించేదిశగా ఎందుకు ఆలోచనచేయలేదు?
గతంలో కేంద్రమంత్రి షెకావత్ ను పోలవరానికితీసుకెళ్లి… టీడీపీహయాంలో కట్టించిన ఇళ్లను మీరు కట్టించినట్లు చూపించుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు కేంద్రమంత్రి వచ్చినప్పుడు అక్కడేం మాట్లాడాడో, దమ్ము, ధైర్యంఉంటే బయటపెట్టండి. తలకొట్టుకుంటూ రెండేళ్లముందే ప్రాజెక్ట్ ను పరిశీలించిఉంటే, పోలవరానికి ఈ దుస్థితివచ్చేదికాదని కేంద్రమంత్రి షెకావత్ వాపోయింది నిజంకాదా? పోలవరం సందర్శనకు కేంద్రమంత్రితోకలిసి వెళ్లిన ముఖ్యమంత్రి, ఆయనతో ప్రాజెక్ట్ పనులు, నిర్వాసితులసాయం గురించి ఎందుకుమీడియాతో మాట్లాడించ లేకపోయాడు?
చంద్రబాబు హయాంలో ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ లో జరిగే పనులను ప్రజలముందు ఉంచేవారు. పోలవరం పూర్తిచేయాలన్న ఏకైకధృడసంకల్పంతోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకముందే చంద్రబాబుగారు పక్కరాష్ట్రంలోని 7మంపుమండలాలను ఏపీలో కలపాలని కేంద్రాన్నిపట్టుబట్టి సాధించారు.
36నెలలపాలనలో ఈప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ రివ్యూలకు సంబంధించిన పనులు బయటపెట్టారా? ఎప్పుడైనా మీడియావారికి వివరాలుచెప్పి, వారి సందేహాలను నివృతిచేశారా? జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే 10, 11 పీపీఏసమావేశాలమినిట్స్ గానీ, తరువాత ఆగస్ట్ లో జరిగిన పీపీఏ సమావేశం మినిట్స్ గానీ తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఎందుకు ఆడారు.. గతంలో జరిగిన పనులు ఎందుకు రద్దుచేశారు.. ఆర్ అండ్ రిటైర్డ్ ఇంజనీర్ తో కమిటీలు ఎందుకు వేయించారు… రివర్స్ టెండ రింగ్ పేరుతో రిజర్వ్ టెండరింగ్ జరిపిఎంత ఆదాచేశారు..చేయాల్సింది అంతాచేశాక.. ఇప్పుడు పనులుఎప్పుడు జరుగుతాయో… డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాచేతుల్లోలేదని ఎందుకు అంటున్నారో సమాధానం చెప్పండి? ఈ ప్రశ్నలన్నింటికీ ముఖ్యమంత్రి మీడియా ముందుకొచ్చి ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఏం అడిగినా రెండు చేతులు పైకిఎత్తి తనకేమీ తెలియదంటున్నాడు.
తమ ప్రభుత్వంలో చంద్రబాబుగారి హాయాం లో 400టీఎంసీలకు పైగా నీటిని లిఫ్ట్ చేసేలా పట్టిసీమనిర్మిస్తే, అది దండగన్నారు. పట్టిసీమ నీటిని ప్రకాశంజిల్లా మీదుగా రాయలసీమకు తరలిస్తే, అదిపనికిరానిదన్నారు. పట్టిసీమతో చంద్రబాబు రూ.4వేలకోట్లు దండగచేశాడంటున్న గోబెల్స్ రాంబాబు, అసమర్థ ముఖ్యమంత్రి, మరిప్పుడు అదేవిధమైన మరోలిఫ్ట్ ను పోలవరంపై ఎందుకునిర్మించాలని చూస్తున్నారో సమాధానంచెప్పాలి? పోలవరంజాప్యానికి, ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అవరోధకులు ప్రధానకారకులు… తండ్రీకొడుకులే. రాజశేఖర్ రెడ్డి హాయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం 4ఏళ్లు జాప్యంచేయడంవల్ల రూ.2500కోట్ల నిర్మాణవ్యయం పెరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు తన దురుద్దేశం..అవినీతి..రివర్స్ టెండరింగ్ డ్రామాలు… పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దురాలోచనతో ఏకంగా పోలవరం నిర్మాణాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు.
ఇప్పటికే చేయాల్సింది అంతాచేసి, జాతీయప్రాజెక్ట్ ని చంకనాకించిన జగన్ రెడ్డి,… ఇప్పుడు పనులు ఎప్పుడు జరుగుతాయో… డయాఫ్రమ్ వాల్ నిర్మాణం మాచేతుల్లోలేదని తనమంత్రితో చెప్పించడంలోని ఉద్దేశంఏమిటి? ప్రాజెక్ట్ గురించి ఎవరుఏం అడిగినా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి రెండు చేతులు పైకి ఎత్తి తనకేమీ తెలియదంటున్నాడు. డయా ఫ్రమ్ వాల్ నిర్మాణంసహా, 36నెలల్లో ఈప్రభుత్వం పోలవరంలో చేసినపనులు.. టీడీపీప్రభుత్వంలో జరిగిన పనులపై పూర్తివాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము జగన్ రెడ్డికి ఉందా? డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ రెడ్డి మూర్ఖపు, అహంకారపూరిత నిర్ణయాలే కారణం. పోలవరానికి బాగా వరదలు వచ్చే సమయంలోనే ప్రాజెక్ట్ సైట్ లో కాంట్రాక్ట్ సంస్థను లేకుండా జగన్ రెడ్డి ఎందుకు చేశాడు?
పోలవరం లాంటి ప్రాణనాడితో ఆటలాడి, దురుద్దేశంతో తనస్వార్థంకోసం, కమీషన్లకక్కుర్తితో, మీకు నచ్చినవారితో ప్రాజెక్ట్ కట్టించాలన్న దుర్మార్గపు ఆలోచనతో జాతీయప్రాజెక్ట్ ను నాశనంచేసి, రాష్ట్రానికితీరని అన్యాయంచేసిన జగన్ రెడ్డి రాష్ట్రరైతాంగానికి బహిరంగ క్షమాపణచెప్పాలి. ఈ వాస్తవాలను ముఖ్యమంత్రిఒప్పుకొని రాష్ట్రప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. అసమర్థ ముఖ్యమంత్రి, చేతగాని ప్రభుత్వంచేతిలో పోలవరంప్రాజెక్ట్ ముమ్మాటి కీ ప్రశ్నార్థకమైందనే చెప్పాలి.
రాయలసీమకే కాదు.. తనఅసమర్థత, చేతగానితనంతో జాతీయప్రాజెక్ట్ కు ద్రోహంచేసిన వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. టీడీపీహాయాంలో ప్రాజెక్ట్ కు సంబంధించి జరిగిన పనులకు సంబంధించి ప్రతిఅంగుళం వివరాలను తాముబయట పెట్టాము. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి తన 36 నెలల పాలనలో చేసిన పనుల వివరాలు …నిర్వాసితులకు అందించిన సహాయం వివరాలు మీడియా సమక్షంలో బయటపెట్టాలని ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.