Suryaa.co.in

Entertainment

ఒక వేణువు ఆగింది

(నేడు జి.ఆనంద్ వర్ధంతి)
దిక్కులు చూడకు రామయ్యా..
ఏ దిక్కుకేగినావు ఆనందయ్యా..
మమ్మల్ని నీ గీతామృత
ఆనంద డోలికల్లో విహరింపజేసి
ఇప్పుడు దుఖసాగరంలో
ముంచి గంధర్వ లోకమున
నీ ఆరాధ్య గాయకులు
ఘంటసాల..పిబి..
ఎస్పీబి సరసకు చేరినావా..
మళ్లీ రావా..

ఒక వేణువు
వినిపించెను
అనురాగ గీతిక..
ఎంత చక్కగా ఆలపించావయ్యా
ఆ గీతం
ఎన్నిసార్లు ఆలకించామయ్యా
ఎన్నెన్ని సార్లు ఆస్వాదించామయ్యా
ఆ గానామృతం..
కల్పనకు నీ పాటే ప్రాణమంటే
కాబోదు అభూతకల్పన..
నువ్వెళ్ళినా నీ పాట
అలా ఉండిపోతుంది
మా గుండెలోన ..!

కచేరీలలో నువ్వు పాడిన పాటలు సంగీతానికి
నిజమైన నీరాజనాలు..
పాటలపై నీ మక్కువకు
నిర్వచనాలు..
సినిమాల్లో పాడినపుడు
నీది గంభీర కంఠం
ఆర్కెస్ట్రాల్లోనైతే దశకంఠం…
ఘంటసాల..బాలు..
ఎవరి పాట పాడినా
అచ్చం అలాగే..
మాస్టారు దిగి వచ్చినట్టే..

నీ గొంతుతో వెంకన్నను కొలిచావు..
అయ్యప్పను పిలిచావు..
ఈశును..ఏసును
మురిపించావు..
మము మైమరపించావు..
అందుకే..అందుకే..
నువ్వెళ్ళినా నీ పాట మాతోటే..

ఓ కోవిడూ..
ఎంత పనిచేసావే..
మా ప్రాణమైన
రెండు గొంతులు నొక్కావు…
ఆ ఇద్దరినీ మింగినా
వారి పాటలు అలా అలా నిత్యం మార్మోగవా
మా లోగిళ్లలో..
ప్రతి ఇల్లు వారి పాటల తీరమే
ఆప నీ తరమా..!?
అభిమాన గాయకుడు ఆనంద్ కు నివాళి..

– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

LEAVE A RESPONSE