ఇటీవల ఉస్మానియా లో ఎన్‌ఎస్‌యుఐ నిర్వహించిన నిరసనలో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా 17 మందితో కూడిన ఎన్‌ఎస్‌యుఐ బృందాన్ని 14 రోజుల రిమాండ్ పై చంచల్ గూడ జైల్లో నిర్బంధించిన విషయం విదితమే. రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి బృందాన్ని, చంచల్ గూడ జైల్లో సిఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క తో కలిసి వారికి అండగా తానున్నానని భరోసానివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్ధినేతలు యూనివర్శిటీ పరిస్థితులతోపాటు, తెలంగాణ విద్యారంగ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. ’ రాహుల్ మిమ్మల్ని పరామర్శించేందుకే ఇక్కడకు వచ్చారు. మీకు తగిన న్యాయం జరుగుతుంది. పార్టీలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాహుల్ సభ కోసం మీరు చేసిన ప్రయత్నాలను రాహుల్‌కు వివరించా’నని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విద్యార్థి నేతలతో అన్నారు. రాహుల్ సైతం అధైర్యపడవద్దని, తెలంగాణలో భవిష్యత్తు మీదేనని విదార్ధులకు భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్‌ఎస్‌ఐ మరింత చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.