అప్పులిస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు సంక్షేమం అందించలేని దుస్థితి

– 7వతేదీ వచ్చినా చాలామంది రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇంకా జీతాలు ఇవ్వలేదు. దేశంలో ఏ ప్రభుత్వానికి రానంత ఆదాయం, జగన్ ప్రభుత్వానికి వస్తున్నా, జీతాలు చెల్లింపుకు ఎందుకు అవస్థలు పడుతోంది?
• అప్పులకోసం ఎక్కేగడప, దిగేగడప అంటూ బిజీగా ఉన్న ఆర్థికమంత్రి తక్షణమే రాష్ట్రఆర్థికపరిస్థితిపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
• చెత్తపన్నుకట్టలేదని ప్రజల ఇళ్ల ముందు చెత్త వేయించిన జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం, ఇప్పుడు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇవ్వనందుకు ఆయన ఇంటి ముందు వారంతా కూడా చెత్తవేయాలా?
• టాక్స్ పేయర్స్ ను అవమానిస్తున్న ప్రభుత్వం ఇంతకుఇంత మూల్యంచెల్లించుకోక తప్పదు
• ఉద్యోగులను భయపెట్టి, ఉద్యోగ సంఘం నేతలను ప్రలోభపెట్టి, వారికి అన్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం, ఎన్నాళ్లు తప్పించుకుంటుందో చూస్తాం
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు

ఎవరోఒకరు అప్పులు ఇస్తే తప్ప, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చిందని, మే7వ తేదీ వచ్చినా చాలామందికి నేటికీ జీతాలు పడలేదని, సామాజిక పింఛన్ల చెల్లింపులకు కూడా జగన్ ప్రభుత్వం అప్పుల కోసం అర్రులుచాసే స్థితికి దిగజారిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు.

శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

కరోనాతో చాలారాష్ట్రాలు తీవ్రంగా ఆదాయంకోల్పోయినా, ఏపీప్రభుత్వానికి మాత్రం ఆదాయం తగ్గలేదు. జీఎస్టీ చెల్లింపుల్లో, ఇతరత్రా మార్గాల్లో ఆదాయం మూడేళ్లలో బాగానే పెరిగింది. కరో నాను బూచిగా చూపుతూ, ఆదాయం తగ్గిందన్న ప్రభుత్వ వ్యాఖ్యలు అబద్ధాలు. చాలారాష్ట్రా లకు ఆదాయం తగ్గినా కూడా అవేవీ ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గానీ, ఉద్యో గుల జీతభత్యాలు గానీ ఏమీ ఆపలేదు.

2020-21, 2021-22లో గానీ జీఎస్టీ ఆదాయం, వ్యాట్ ఆదాయం ప్రభుత్వానికి విపరీతంగా పెరిగింది. అలానే కేంద్రప్రభుత్వంనుంచివచ్చే నిధులు కూడా పెరిగాయి. కానీ ఏపీప్రభుత్వం మాత్రమే కరోనాను అడ్డంపెట్టుకొని ఇష్టానుసారం అప్పులుచేస్తూ, ఆసొమ్మంతా ఏంచేస్తుందోచెప్పకుండా అటుప్రజలతో, ఇటు ఉద్యోగులతో ఇప్పటికీ ఆడుకుంటోంది.

రెగ్యులర్ ఉద్యోగులమాదిరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఠంఛన్ గా ఒకటోతేదీనే జీతాలు అందించాలని చంద్రబాబునాయుడు గారు ఆదేశించారు. ఆయన తన ఐదేళ్లపాలన దాన్ని కచ్చితంగా తూచాతప్పకుండా అమలుచేశారు. ప్రభుత్వఉద్యోగుల్లో ఔట్ సోర్సింగ్ వారైనా, రెగ్యులర్ వారైనా వారికమిట్ మెంట్స్ వారికి ఉంటాయి. వారునెలనెలా చెల్లించాల్సిన వివిధరకాల ఈఎమ్ఐలు ఆలస్యమైతే, ఈప్రభుత్వం చెల్లిస్తుందా? బ్యాంకువారు ఈఎమ్ఐల ను కచ్చితంగా ఒకటోతేదీనే ఉద్యోగులఖాతాలనుంచి మినహాయించుకుంటారు.

96,898 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుంటే, వారిలో 76వేలమందికి ఏప్రియల్ నెల జీతాలను ఇ వ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఆఖరికి ఏప్రియల్ 30వ తేదీనాటికి 61వేలమందికే జీతాలు ఇచ్చింది. వీటన్నింటిగురించి తాముమాట్లాడితే ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ లో ఇబ్బందులున్నా యని తప్పించుకుంటోంది.

సీఎఫ్ఎంఎస్ లో ఇబ్బందులుంటే, మార్చినెలకు సంబంధించి ఉద్యోగులతాలూకా 13వేలకోట్లబిల్లులను ఎందుకు జగన్ ప్రభుత్వం రిటర్న్ చేసిందో చెప్పాలి ? ఈ లెక్కలన్నీ తానుచెప్పడంకాదు.. ప్రభుత్వమే చెప్పింది.

రిటైర్ మెంట్ బెనిఫిట్స్ కింద రూ.2,100కోట్లు చెల్లించాల్సిఉందని గతంలో ప్రభుత్వమేచెప్పింది…. ఆ మొత్తంలో ఎంత మొత్తం ఉద్యోగులకు ఇచ్చారో, ఎంత ఇవ్వాల్సి ఉందో ఎవరికీ తెలియదు. ఉద్యోగులకు రూ.5వేల కోట్ల వరకు జీతాలుచెల్లిస్తే ఆమొత్తంలో దాదాపు రూ.4,800కోట్లు తిరిగి వివిధ మార్గాల్లో మార్కెట్లోకి చలామణీ అవుతుంది. ఆ విధంగా డబ్బులు రొటేట్ అవ్వబట్టే… ఆర్థికంగా వివిధరకాల వ్యవస్థలు నిలవగలుగుతున్నాయి. అలాంటి ఉద్యోగులకే జీతాలు ఇవ్వకపోతే, దాని ప్రభావం అంతిమంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులు అడగకపోయినాకూడా రిటైర్ మెంట్ వయస్సుని 2ఏళ్లుపెం చాడు. దానికికారణం రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకనే అనేది అందరికీతెలుసు. ఉద్యోగుల జీతాలేకాదు.. ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల సొమ్ము కూడా సక్రమంగా చెల్లించడంలేదు. ప్రభుత్వపథకాలకు లక్షమంది అర్హులైతే వారిలో 30, 40వేలమందికి మాత్రమే ఇస్తున్నారు. వైఎస్సార్ చేయూత కింద తమకు అందాల్సినసొమ్ముని ప్రభుత్వంఇవ్వలేదని కొందరు లబ్ధి దారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, కోర్టు ప్రభుత్వాన్ని ఎందుకు డబ్బులివ్వలేదని ప్రశ్నిం చింది.

ఇలా అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం ఆర్థికంగా ఎక్కడికక్కడ తప్పులమీద తప్పు లుచేస్తూ, ప్రజలను, ఉద్యోగులను నానారకాలుగా ఇబ్బందిపెడుతోంది. అంగన్ వాడీ సిబ్బం దికి మూడునెలలనుంచీ జీతాలు లేవు. అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వయంగా అంగన్ వాడీకేంద్రాలకు వెళితే వారికి వాస్తవాలు అర్థమవుతాయి. ఆఖరికి కోడిగుడ్లు సరఫరా చేసే సంస్థలకు కూడా ఈప్రభుత్వం బకాయిలుపెట్టింది. ఇలా అప్పులు ఇస్తే తప్ప, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడపలేని దుస్థితికి జగన్ రెడ్డి వచ్చేశారు.

ఉద్యోగుల మెడికల్ బిల్లులను కూడా క్లియర్ చేయడంలేదు. అప్పోసప్పో చేసి, ప్రైవేట్ ఆసుప త్రుల్లో వైద్యంచేయించుకుంటే, ఆ బిల్లులు కూడా క్లియర్ చేయలేకపోతున్నారు. జీతాలు, ఇతర ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఉద్యోగులను భయపెట్టి, వారిసంఘాలనేతలను లొంగదీసు కున్నంత మాత్రాన అంతాబాగున్నట్లుకాదు. ఏపీప్రభుత్వం దివాళాతీసింది కాబట్టే, ఏ బ్యాంకు కూడా ఈ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వడంలేదు.

ప్రభుత్వం చేసే విచ్చలవిడిఖర్చు లు.. ఆర్థికతప్పిదాలు… అవనసరఖర్చులకు ఉద్యోగులు ఎందుకుబలికావాలని ప్రశ్నిస్తున్నా . పెట్రోల్ డీజిల్ ధరలు, విద్యుత్ , ఆర్టీసీఛార్జీలు, ఇతరత్రాపన్నులు, ధరలపెరుగదలో ప్రభు త్వం ప్రజలనుంచి భారీగానే వసూళ్లకుపాల్పడుతోంది. ప్రజలనుంచి వసూలుచేస్తున్నది… అప్పులుతెస్తున్న సొమ్మంతా ఏమవుతుందంటే ప్రభుత్వం వద్ద సమాధానంలేదు.
తెలుగుదేశం ప్రభుత్వం ఆర్థికవిధానాలపై జూలై 2019లో శ్వేతపత్రం విడుదల చేసిన జగన్ ప్రభుత్వం, ఇప్పుడు వారి ప్రభుత్వ విధానాలపై కూడా అలానే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఉద్యోగుల జీతాలను సక్రమంగాచెల్లించకుండా, అటుకేంద్రప్రభుత్వంతో మొట్టికాయలు వేయించుకుంటూ, ఈ ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే సొమ్మంతా ఏంచేస్తుందో తెలియకుండా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం తక్షణమే రాష్ట్రఆర్థికపరిస్థితిపై పూర్తి వాస్తవాలతో కూడిన సమాచారంతోశ్వేతపత్రం విడుదలచేయాలని ఉద్యోగ సంఘం మాజీ నాయకుడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.

ప్రభుత్వవ్యవస్థలో ముఖ్యభూమిక పోషిస్తున్న అతిపెద్ద వ్యవస్థ అయిన ఉద్యోగుల వ్యవస్థను ప్రభుత్వం పదేపదే మోసంచేసింది. ప్రభుత్వసర్వీసుల నుంచి రిటైరైన 4లక్షలమందికి కూడా వారికి చెల్లించాల్సిన బెనిఫిట్స్ అన్నీచెల్లించలేదు. పోలీస్ శాఖ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లీవ్ ఎన్ క్యాష్ మెంట్… ఇతరత్రా బెనిఫిట్స్ ఏమి చెల్లించడం లేదు.సీపీఎస్ రద్దు చేస్తాను.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని జగన్ రెడ్డి చెప్పినహామీలను నమ్మిన ఉద్యో గులు చొక్కాలు చించుకొని మరీ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ హమీలన్నీ నెరవేర్చకపో తే పోయారుగానీ, కనీసం ఉద్యోగుల జీతాలు అయినా సక్రమంగా ఇవ్వాలని కోరుతున్నాం.

ఆర్థిక మంత్రి ఆర్థికశాఖను పూర్తిగా విస్మరించి.. అప్పులకోసం ఎక్కేగడప, దిగేగడప పనిలో ఉన్నారు. రాష్ట్రంఎందుకింతలా అప్పులపాలై, ప్రజలకు, ఉద్యోగులకు కూడాన్యాయంచేయలే ని దుస్థితి ఎందుకువచ్చిందో రాష్ట్రఆర్థికమంత్రి సమాధానంచెప్పాల్సిందే. మూడునెలల పాటు జీతాలు ఇవ్వలేదంటే, ఉద్యోగులకు అందాల్సినజీతాలను ప్రభుత్వం మరోదానికి ఖర్చుపెట్టిం దని అర్థమవుతోంది. ప్రభుత్వం బాధ్యతగా తాము ఫలానాతేదీవరకు జీతాలు ఇవ్వలేమని చెబితే, ఉద్యోగులు వారితిప్పలు వారుపడతారు. ప్రజలపై రాష్ట్రంలో చెత్తపన్నువేయడం అనే ది ఈ ప్రభుత్వంలోనే చూశాము. చెత్తపన్నుకట్టడంలేదని ప్రజలఇంటిముందు చెత్తవేయించి న ప్రభుత్వం, ఇప్పుడుఉద్యోగులకు జీతాలు ఇవ్వని ప్రభుత్వాన్ని ఏంచేయాలని ముఖ్యమం త్రిని ప్రశ్నిస్తున్నాం.

ఉద్యోగులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇంటిముందు వారంతా ఏంవేయాలో.. ఆయన్నిఎలానిలదీయాలో, ఎలా దారికి తేవాలో వారు ఆలోచించుకోవాలి. ఈ వైసీపీ ప్రభుత్వ అవినీతికిఉద్యోగులు ఎందుకు బలికావాలని ప్రశ్నిస్తున్నాం? ఉద్యోగులు, వారిసంఘాలు ముఖ్యమంత్రిని నిలదీసి, గట్టిగా మాట్లాడకపోతే, ప్రతిపక్షం తరపున తాము చేయాల్సింది చేస్తాము.

 

Leave a Reply