– 14న జరిగే ముగింపు సభకు అమిత్ షా
– ఐదు లక్షల జన సమీకరణకు సన్నాహాలు
– మీడియాతో బండి సంజయ్
కొడంగల్: టిఆర్ఎస్ పార్టీ గ్రూప్ 1 లో ఉర్దూ చేర్చడాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే ఉర్దూ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళని న్యాయపరంగా ఆలోచించి తొలగిస్తాం. గ్రూప్ 1 లో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తా అన్న కెసిఆర్ కు… రాజ్యాంగంపై మాట్లాడే అర్హత లేదు.తెలంగాణలో అధికారంలోకి వస్తామని trs, కాంగ్రెస్ పార్టీలు పగటి కలలు కంటున్నాయి.కేంద్రం నిధులపై పదే పదే విమర్శలు చేసే టీఆర్ఎస్ నేతలు… మీ ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేస్తున్నారో ముందు ప్రజలకు చెప్పండి. ఎంఐఎం ను చంకలో వేసుకుని తిరుగుతున్న పార్టీ టీఆర్ఎస్. ఎంఐఎం మెప్పు కోసమే గ్రూప్ 1 లో ఉర్దూ భాషను చేర్చారు. కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర ముగింపు సభ. ఈనెల 14న జరిగే ముగింపు సభకు అమిత్ షా వస్తున్నారు. ఐదు లక్షల జన సమీకరణకు సన్నాహాలు చేస్తున్నాం. ఎవరెన్ని పగటి కలలు కన్నా…. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వం.