-హిందువులపై దాడులు పెరిగాయి
– బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
– విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసిన కన్నా నేతృత్వంలోని బీజేపీ నేతల బృందం.
– రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడం, మహిళలపై అత్యాచారాలు..హత్యలు, హిందూ దేవాలయాలపై దాడులు, నెల్లూరు హనుమాన్ శోభ యాత్రలో జరిగిన దాడిపై చర్యలు తీసుకోకపోవడం పై గవర్నర్ కు వివరించిన బీజేపీ నేతల బృందం
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా పోలీస్ యాక్షన్ తీసుకోలేదు. రాష్ట్రంలో మతమార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి.హిందువులపై దాడులు పెరిగాయి.
రాష్ట్రంలోని ఏడు ప్రధాన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారు.ఆత్మకూరు లో హిందూ ఏరియాలో మసీదు కడుతున్నారని అడిగితే మా జిల్లా ప్రెసిడెంట్ పై దాడి చేశారు.
తెనాలి లో హిందూ మహిళని అరాజ్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. శ్రీశైలంలో అన్యమత మతస్తులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవు. కాకినాడ జెఎన్ టియు లో ఇల్లీగల్ కనస్ట్రక్షన్ పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం.
బిజెపి నేత భాను ప్రకాష్ రెడ్డి:
ఏపీ లో అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయడం లేదు. జగన్ రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుంది.ఐపిసి సెక్షన్ల కన్నా జగన్ సెక్షన్లే నడుస్తున్నాయి. గోరంట్ల లో మహిళ ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రాకముందే పోలీసులు వైసిపి ఒత్తిడితో రిపోర్ట్ రాశారు.మేం పోరాడితేనే సెక్షన్లు మార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగాయి. గోరంట్ల సంఘటనలో డిఎస్ పి, స్థానిక పోలీసులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే బిజెపి పోరాటం కొనసాగిస్తుంది. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొయ్యేవరకు అందరినీ కలుపుకొని పోరంటం కొనసాగిస్తాం.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి .వేటుకూరి సూర్యనారాయణ రాజు: భూముల ను మస్లింలు ఆక్రమించారు. స్థానిక కోర్ట్ జెఎన్టీయు దే అని తీర్పు వచ్చిన పరిస్థితి. ఎమ్మెల్యే ద్వారం పూడి ప్రొత్సాహం తో ఆక్రమణలు ప్రోత్సహిస్తున్నారు ఇది కోర్ట్ ధిక్కారానికి వస్తుంది ఎమ్మెల్యే ఆగడాలను నిలువరిస్తాం..
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు. బొల్లిన నిర్మల కిషోర్.: అత్యాచార సంఘటనలపై హోంమంత్రి భాద్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు భహిరంగ క్షమాపణ చెప్పాలి. చట్టాలు నిందితులకు చుట్టాలుగా మారుతున్నాయి. హోంమంత్రి నో బర్తరఫ్ చేయాలి.ఈ రాష్ట్రంలో మహిళల తరపున పోరాడరా..షర్మిల ఎక్కడ. ఉన్నారు అని నిర్మలా కిషోర్ ఎద్దేవా చేశారు.