హేట్సాఫ్.. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి ధర్మాసనానికి . ఆర్టికల్ 21 గురించి ప్రభుత్వానికి, పోలీసులకు, ప్రజలకు వివరంగా తెలియపరచినందుకు . అలానే ప్రభుత్వానికి గొప్ప హెచ్చరిక చేసారు ఆర్టికల్ 142 ని ఉపయోగించి . కమీషన్ల , పేనల్స్ సిఫార్సులను గోడౌన్లలో ఉంచి కాలగర్భంలో కలుపుతున్న ప్రభుత్వాలకు తమ రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేస్తున్నందుకు .
ఈమధ్యే మనందరం గంగూభాయ్ సినిమాలో చూసాం గంగూభాయ్ పోరాటాన్ని , ఆరాటాన్ని . వ్యభిచార వృత్తిలో ఉన్న వారికి , వారి పిల్లలకు ఓ చారిత్రాత్మక రక్షణను కలిగించిందీ తీర్పు . వ్యభిచారుల దగ్గరకు నిత్యం పోయే మగానుభావులు కూడా సూక్తి ముక్తావళిని వినిపిస్తుంటారు . సమాజంలో రాజకీయ , ఆర్ధిక , మానసిక , సామాజిక వ్యభిచారం చేసే వాళ్ళు కూడా కధలు చెబుతూ ఉంటారు . ఈ తీర్పు నిస్సందేహంగా చారిత్రక తీర్పు .
ప్రెస్ కౌన్సిల్ కు ఓవర్ ఏక్షన్ చేయవద్దని హితవు కూడా చెప్పారు . వాళ్లకు భయం ఉంటే ఒక రకంగా , భయం లేకపోతే మరో రకంగా వార్తల్ని కవర్ చేస్తూ ఉంటారు కదా మన మెరుగైన సమాజ హితులు .
ఇంక ఆర్టికల్ 142 . ప్రభుత్వాలు కూడా ప్రైవేటు పార్టీలు అయిపోయాయి . తమకు ప్రయోజనం కలిగించే విషయాలయితే ఆఘమేఘాలపై తెల్లవారుజామున కూడా ఆర్డినెన్సులు ఇస్తుంటారు . వ్యభిచార వృత్తిలో ఉన్న వారికి సంబంధించి ఓ పేనల్ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు 2011’జూలైలో 10 సిఫార్సులను ఇస్తే , వాటిని కోల్డ్ స్టోరేజిలో పడేసింది ప్రభుత్వం .
ప్రభుత్వం తీరిగ్గా వాటి మీద ఏదో ఒక చర్య తీసుకునే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది . ఈమధ్య కాలంలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ని ఉపయోగించి ప్రభుత్వానికి ఓ సందేశం ఇచ్చింది . ప్రభుత్వాలు ప్రైవేటు పార్టీలుగా ప్రవర్తించవద్దని.హ్యూమన్ డిగ్నిటీ, సివిల్ రైట్స్ విషయాలలో ఈ మధ్య సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాలను నేను స్వాగతించటమే కాదు అభినందిస్తున్నాను కూడా .
– Prof D A R Subrahmanyam
Founder
Navyandhra Intellectual Forum