– జోకర్ లను పక్కన పెట్టుకుని మహానాడులో బాబు బూతు పురాణం విప్పాడు
– డిప్యూటీ సీఎం అంజాద్ బాషా:
సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర నాలుగో రోజుకు చేరింది. నంద్యాలలో ప్రారంభమైన ఈ యాత్ర ఇవాళ సాయంత్రం అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది.
ఈ సందర్భంగా నంద్యాలలో పలువురు మంత్రులు మాట్లాడుతూ…
మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్
– డిప్యూటీ సీఎం అంజాద్ బాషా:
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితన పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి పదవుల్లోనూ 50శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ఆయనకు ప్రతి ఒక్కరు అండగా ఉండాలి. ఒక పక్క బడుగు, బలహీనవర్గాల వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తూ… మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఆర్థిక స్వావలంభన కల్పిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఒకపక్క కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినా ఎక్కడా సంక్షేమ పథకాలు అమలు నిలిచి పోకుండా క్యాలెండర్ ప్రకారమే అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుంది.
చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడు పేరుతో కొందరు జోకర్లు, బ్రోకర్లను పక్కన పెట్టుకొని ప్రభుత్వాన్ని తిట్టించే ప్రయత్నం చేశారు. బీసీలు మా పార్టీ పేటెంట్ అని, చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి వారి అభివృద్ధికి చేసింది శూన్యం. వాళ్లను ఓటుబ్యాంకు రాజకీయాలకు వాడుకుని గద్దెనెక్కారు.
అంతేకాకుండా మైనార్టీలను చిన్నచూపు చూశారు. తన ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు, ఎస్టీలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబుకు నంద్యాల ఉప ఎన్నికల్లోనే కనువిప్పు కలిగింది. ఉప ఎన్నికల్లో గెలవాలంటే మైనార్టీ ఓట్లు అవసరం అని గుర్తించిన చంద్రబాబుకు ఎండీ ఫరూక్ అప్పుడు గుర్తుకు వచ్చారు. అంతవరకూ వారికి అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన పోలేదు.
అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలిసారి తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా, ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అలాగే నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలలుగా అవకాశం ఇచ్చారు. శాసనమండలిలోనూ నలుగురు మైనార్టీలకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే. ఒక మైనార్టీ మహిళలకు శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌గా నియమించిన ఘనత కూడా ముఖ్యమంత్రిదే. మైనార్టీలంతా వైయస్సార్ సీపీకి అండగా ఉండాలి.
రాజకీయ పార్టీలన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయి . రాబోయే రోజుల్లో శ్రీలంక తరహాలో తయారు అవుతుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. లక్షా 40 వేల కోట్లు రూపాయలు మధ్యవర్తులు, దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్న ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీ విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరు.
అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గౌరవాన్ని ఇచ్చిన ఈ ప్రభుత్వానికి, వైఎస్ జగన్‌కి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే పేదరికం అనేదే ఉండదని స్పష్టం చేస్తున్నాం. బడుగు, బలహీన వర్గాలకు పూర్తిగా న్యాయం జరుగుతుంది.
– సామాజిక న్యాయ భేరికి అపూర్వ స్పందన
మంత్రి గుమ్మనూరు జయరాం
దేశంలోనే సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన సామాజిక న్యాయ భేరికి ప్రజల నుంచి అపూర్వమైన స్వాగతం లభిస్తోంది.
వైఎస్ జగన్ మంత్రివర్గంలో 17మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించడమే కాకుండా, మైనార్టీ మంత్రికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా తన కేబినెట్లో మైనార్టీలకు స్థానం కల్పించారా? డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారా అని సూటిగా అడుగుతున్నాం.
అట్టడుగు వర్గాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలను ఉన్నతస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి పెద్దపీట వేశారు. బీసీ వాల్మీకి కుటుంబానికి చెందిన నన్ను తొలిసారి కేబినెట్లోకి తీసుకుని మరో రెండున్నరేళ్లు మంత్రి పదవిలో కొనసాగించారంటే జగన్‌గారు ఎలాంటి నాయకుడో ప్రతి ఒక్కరూ తెలసుకోవాలి. అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత పథకం ద్వారా ఆ కుటుంబాలను ఆదుకుంటున్నారు.
మతిస్థిమితం కోల్పోయిన చంద్రబాబు మహానాడులో ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఒకలక్షా 40వేల కోట్లు లబ్ధిదారులకు అందిస్తుంటే దానిపై కూడా దోచుకుంటున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అలాంటి ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.
జగన్ మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది.