Suryaa.co.in

Andhra Pradesh

అచ్చెన్నాయుడిని తాకాలంటే శ్రీనివాస్ స్టూల్ వేసుకొని నిలబడాలి

– టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

మహానాడు విజయవంతం కావడం, తెలుగుదేశానికి ప్రజాదరణ పెరగడంతో మంత్రులు, వైసీపీనేతలకు మతిభ్రమించి పిచ్చికూతలు కూస్తున్నారు. అచ్చెన్నాయుడి కటౌట్ చూస్తేనే దువ్వాడకు తడిసిపోతుంది. అచ్చెన్నాయుడిని తాకాలంటే శ్రీనివాస్ స్టూల్ వేసుకొని నిలబడాలి.మానేత అచ్చెన్నాయుడు తొడకొడితే, ఆ సౌండ్ కే దువ్వాడ గుండెఆగి చస్తాడు.

దువ్వాడకు కొట్టుకోవాలని అంతసరదాగా ఉంటే, డేట్, టైమ్, ప్లేస్ చెబితే నేనే వెళ్తాను. శ్రీనివాస్ స్థాయికి అచ్చెన్నాయుడు అవసరంలేదు. టీడీపీ రాష్ట్రఅధ్యక్షులు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు నీచాతినీచం.టెక్కలిరోడ్లమీదకువస్తే అచ్చెన్నాయుడిని కొడతానన్న సొంతపార్టీఎమ్మెల్సీ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి ఖండించకపోవడం సిగ్గుచేటు. అచ్చెన్నాయుడి గుడ్డలూడిదీసి కొడతానంటున్న దువ్వాడ శ్రీనుని, టెక్కలిప్రజలు ఒకటికి నాలుగుసార్లు గుడ్డలూడదీసి కొట్టడంఖాయం. ప్రజాక్షేత్రంలో ఇప్పటికే టెక్కలివాసులు దువ్వాడని బట్టలూడదీసి నించోబెడితే, దానికి సిగ్గుపడకుండా వెర్రిచేష్టలతో, పిచ్చికూతలు కూస్తున్నాడు. దువ్వాడ ఒళ్లు అదుపులోపెట్టుకొని మాట్లాడకపోతే, భారీమూల్యం చెల్లించుకుంటాడని హెచ్చరిస్తున్నాం.

LEAVE A RESPONSE