Suryaa.co.in

Telangana

విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాలి

– ఆ బాధ్యత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దే
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో తొలిసారిగా అధికారికంగా నిర్వహించనుండటం, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు హాజరుకానుండటం సంతోషకరమని.., అయితే రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కూడా అమిత్ షా పై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఆ చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని వినోద్ కుమార్ అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసే బాధ్యత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై ఉందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని కాలేశ్వరం ప్రాజెక్టు గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి కోరారు.

తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వెంటనే అమలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధిని సాధిస్తోందని, తెలంగాణలో ఐ టి ఐ ఆర్ విషయంలో కేంద్రం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెగా పవర్ పార్క్, టెక్స్టైల్స్ క్లస్టర్ వంటి సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని వినోద్ కుమార్ అన్నారు.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కొన్ని దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతున్నా వాటిని మోడీ ప్రభుత్వం పట్టించుకోక పట్టించుకోకుండా ఎన్నికలు జరిగే ఎన్నికలు, జరిగిన ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లను మంజూరు చేసిందని, విభజన చట్టంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయానికి గురి చేస్తోందని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ను మంజూరు చేయక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో పసుపు పంటను రైతులు విస్తారంగా పండిస్తారు అని ఆయన పేర్కొన్నారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలకు నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా ఇప్పటివరకు నయాపైసా కూడా విడుదల కాలేదని వినోద్ కుమార్ తెలిపారు.

గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రం హైదరాబాద్ కు మంజూరు కాగా దాన్ని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కు తరలించిందని, ఇది తెలంగాణకు జరిగిన అన్యాయం అని ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం తన నిధులతో ఏర్పాటు చేస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా వివక్షతను చూపుతోందని వినోద్ కుమార్ అన్నారు. ఐఐఎం, ఐ ఐ టి, సాఫ్ట్ వేర్ పార్క్ మంజూరు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయానికి గురి చేస్తోందని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విభజన చట్టంలోని హామీలను వెంటనే పరిష్కరించాలని వినోద్ కుమార్ కోరారు.

LEAVE A RESPONSE