మసీదులలో మౌజన్లకు , పాస్టర్లకు డబ్బులు..దేవాలయాలపై ఎందుకు తేడా ?

– అవినీతి యాప్ వైసీపీ నేతల అవినీతితో మొదలుపెట్టాలి
– ఆత్మకూరు లో పోటీ చేస్తున్నాం
– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విష్ణువర్ధన్ రెడ్డి

5 లక్షల ఆదాయం ఉన్న దేవాలయాల హక్కు యాజమన్యాలదే అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయం అని మంత్రి ఎలా అంటున్నారు ? దేవాలయ మంత్రి మాయ మాటలు చెప్పవద్దు . మసీదులలో మౌజన్లకు డబ్బులు, పాస్టర్లకు డబ్బులు.. దేవాలయాలపై ఎందుకు తేడా ?

దేవాలయాల్లో హుండీల లెక్కలు కూడా మీకు చెప్పాలి , ఇతర మతాలను ఎందుకు అడగరు ? బిజెపీ అధికారంలోకి వస్తే.. చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను స్వేచ్ఛగా ఉంచుతాం. గ్రూప్ – 1 అభ్యర్ధుల ఇబ్బందులపై గవర్నర్ కు లేఖ రాస్తాం.ఏపీలో పెన్షన్లు, మంత్రులకు జీతాలు తప్ప ఏం చేస్తున్నారు ? ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారా? ఓట్లు కొనుక్కోవడానికే సీఎం జగన్ డబ్బులిస్తున్నారు.అభివృద్ధి అంటే ప్రజల సొమ్ము ప్రజలకు పంచి ఓట్లు కొనుక్కోటమా? భూసేకరణ పేరుతో భూములు వైసీపీ నేతలకు కట్టబెడుతున్నారు.

అవినీతి యాప్ వైసీపీ నేతల అవినీతితో మొదలుపెట్టాలి. ఏపీలో తమ‌ వాటా ఇవ్వలేక కేంద్ర‌ నిధులు వద్దంటున్నారు కర్నూలు మెడికల్ కళాశాల ఆస్తులను కూడా అమ్మేసే పరిస్ధితి తెచ్చారు బస్సు యాత్ర, మహానాడు లలో ఒకరినొకరు తిట్టుకోటానికే వీళ్ళ యాత్రలు, సభలు.ఆత్మకూరు ఉప ఎన్నికలో జనసేన, బీజెపీ బలపరచిన అభ్యర్ధిని పోటీలో పెడతాం. అమలాపురం ఘటనపై సీఎం ఎందుకు మాట్లాడలేదు? ఆత్మకూరు లో పోటీ చేస్తున్నాం . సీఎం ఎందుకు మీ ఎంఎల్ఏల మాటతీరుపై మాట్లాడరు? ఇంజనీర్ పై ఎంఎల్ఏ చేయి చేసుకున్నాడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఎస్సీ, ఎస్టీ ఎంఎల్ఏ లకు షాడో ఎంఎల్ఏ లను పెట్టారు ఇకపై ఏపీలో టీడీపీ, వైసీపీ కుటుంబ ప్రభుత్వాలు ఉండవు

Leave a Reply