– మూడు నెలల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకటన
– వ్యక్తిగత ప్రచారానికి తావులేదు
– కాంగ్రెస్ మూల సిద్ధాంతాలను సమిష్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– నవ సంకల్ప మేధోమధన శిబిరంలో రూపొందించిన కాంగ్రెస్ రోడ్ మ్యాప్
– శిబిర్ నిర్ణయాలు వెల్లడించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
వ్యక్తిగత ప్రచారానికి తావివ్వకుండా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను సమిష్టిగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నవ సంకల్ప శిక్షణ శిబిరం ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ సమాజ అభివృద్ధి తో పాటు వచ్చే 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు రోజులపాటు కీసర లోని బాలవికాస్ లో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ నవ సంకల్ప శిబిరం నిర్వహించింది. ఈ శిబిరంలో రాజకీయ, ఆర్థిక, పార్టీ సంస్థాగత, సామాజిక, వ్యవసాయం, యువత సాధికారికత పై ఆరు గ్రూపులుగా ఏర్పడి 180 మంది ప్రతినిధులు లోతైన చర్చ నిర్వహించారు.
భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లడానికి వీరు చర్చల్లో వచ్చిన సారాంశాన్ని నిర్ణయాలుగా చేసి సంకల్ప శిబిర్ మెయిన్ కమిటీకి నివేదించారు. 6 గ్రూప్ ల నుంచి వచ్చిన నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్యం టాగూర్ సమక్షంలో ఏఐసీసీ కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చించారు. అనంతరం ఆ విషయాలను క్రోడీకరించి నవ సంకల్ప శిబిరం సమావేశంలో ప్రతినిధులకు వివరించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నువ సంకల్ప శిబిరంలో చేశాను నిర్ణయాలను ఆ కమిటీ చైర్మన్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.
పొలిటికల్
యువత మీద ప్రధాన దృష్టి.. కాంగ్రెస్ పార్టీతో పాటు అనుబంధ సంఘాల పదవుల్లో 50 శాతం ప్రాధాన్యత
బూత్ స్థాయి నుండి ప్రతి 100 మందికి ఒక ఇంచార్జీ నియామకం
వరంగల్ సభ మాదిరి మహిళల కోసం ఒక భారీ బహిరంగ సభ..
సెక్యులరిజం ,సోషలిజం ను ప్రజల్లోకి తీసుకెళ్లలి..
గిరిజనులకు అండగా నిలబడాలి..
ఎన్నికల మేనిఫెస్టో కనీసం 3 నెలల ముందు ప్రకటన..
ఎన్నికల అభ్యర్థులను 6 నెలల ముందు ప్రకటన..
అమ్మ హస్తం మాదిరి నిత్యవసర సరుకులు భవిష్యత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది..
గిరిజన రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ బలంగా పోరాడాలి.
ఆర్గనైజేషన్
ఉదయ్ పూర్ లో తీసుకున్న నిర్ణయాలను కిందిస్థాయి లో తోసుకుపోవడానికి రోడ్ మాప్..
జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు..ట్రైనింగ్ క్లాస్ ల ఏర్పాటు..
ఎస్సీ ఎస్టీ,బిసి ,మైనారిటీ లకు ప్రాధాన్యత..
ఎన్నికల అవకాశం రాణి వారికి ప్రభుత్వం వచ్చిన తరువాత అవకాశం..
పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28 న ఉత్సవాలు గ్రామస్థాయి వరకు జరపాలి..
కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
వ్యవసాయం
3 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
పంటలకు మద్దతు ధరకు క్వింటాలుకు అదనంగా వెయ్యి రూపాయలు బోనస్ ఇస్తాం..
బడ్జెట్ లో వ్యవసాయ శాఖకు ప్రత్యేక కేటాయింపులు చేయాలి
నియోజకవర్గ వ్యాప్తంగా కోల్డ్ స్టోరెజీలు పెంచాలి..
నకిలీ విత్తనాలను అరికట్టాలి..
ఉపాధి హామీ పనులను 250 రోజులకు పెంచుతూ..వ్యవసాయానికి అనుసంధానం.
రైతులకు,రైతు కూలీలకు పెన్షన్ అందిస్తాం.
ఎకానమీ
అసైన్డ్ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి
ఆస్తుల సృష్టి..రెవెన్యూ కాపాడడం..
బెల్ట్ షాపులు ఆపాలని ఉద్యమం..
విద్య ,ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని ప్రాధాన్యత
సోషల్ జస్టిస్
అసైన్డ్ భూములను కాపాడాలి.. వాటిపై పోరాటం
క్రిమిలేయర్ ఎత్తివేయాలి..
వరంగల్ సభ మాదిరి ఎస్సి,ఎస్టీ,బిసి, మైనార్టీ భారీ సభ
పార్టీ లో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదు..
యూత్
యువత పార్టీ వైపు మల్లెల పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్..
హెల్త్, ఎడ్యుకేషన్ ఫ్రీ..
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి..
జాబ్ క్యాలెండర్ ను ముందే ప్రకటించాలి..
క్వాలిటీ హెల్త్ అందించాలి..
స్పోర్ట్స్ ఆక్టివిటీలను పెంచాలి..
విమెన్ ఆక్టివిటీ పెంచాలి..
ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ కి కళ్ళెం వేసే విధంగా పోరాడాలి.
ఇలా తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ రెండు రోజులపాటు మేధోమధనం నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు ఆయన వివరించారు. రాష్ట్ర సంపదను కొంతమంది మాత్రమే దోపిడీ చేస్తున్నారని అది అందరికీ సమానంగా కాంగ్రెస్ పార్టీ ముందున్న కర్తవ్యం అని పేర్కొన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందని వివరించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ కృష్ణన్, ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర రెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు