– అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు
– సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది.
ఒరిజినల్ కథ :
ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .
ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :
చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .
మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజంలో వివక్షకు గురవుతున్నానని, చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది .
NDTV, CNN IBN,TOI, ET, India Today, Malayala Manorama, TV9. ABN, మొదలైన టీ వీ చానల్స్ మిడతనీ, చీమనీ పక్క పక్కన చూపించి, బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది. R.నారాయణా, cpi నారాయణా, సీతారాం ఏచూరి, ప్రకాష్ రాజ్, అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీవీల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తారు. మేధా పాట్కర్, గద్దర్ లాంటి వారు ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తారు. మాయావతి, ఒవైసీ లాంటి వారు దీన్ని అల్పసంఖ్యాక, మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది. మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ, DMK ప్రభుత్వాలు చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .
విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు.
రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .
ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .
జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .
కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .
ఇండియాలో సాలీడు జాతికి కూడా, మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .
మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ ఉంటారు .
Hats off to the Great Democratic India..
సోమరిపోతులకి ,
బిక్షగాళ్ళ తయారీకి
కొన్ని కుటుంబ పాలన రాష్ట్రాలు ఆత్మ గౌరవం తుంగలో తొక్కి వెధవలుగా బతికే మార్గం చూపెడుతున్నారు.
అన్నీ ఉచితం ! అంతా ఉచితం !
45 ఏళ్ళదాకా నిరుద్యోగ భృతి,
45 ఏళ్ళనుండి వృద్ధాప్య పెన్షను.
ఇంక జీవితంలో లేదు టెన్షన్,
రోగమొస్తే ఆరోగ్యశ్రీ కార్డు
నిద్దరొస్తే సర్కారిచ్చిన ఇల్లు,
చుట్టాలొస్తే రూపాయికిలోసన్నబియ్యపువిందు !
.అంతా బాగానే ఉన్నది !
భూతల స్వర్గం భారతదేశం !
కానీ
రోగానికి మందిచ్చి సేవచేయటానికి ఎవరుముందుకొస్తారు ?
ఇంటినిర్మాణానికి రాళ్ళెత్తే కూలీవస్తాడా ?
.వ్యవస్థ ,సమాజం ఛిన్నాభిన్నం కాదా ! అసలు మన నాయకులు ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ, మనలోని ఆత్మ గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.
పండుగలకు బహుమతి అడిగారా??
లేదు
నాణ్యమైన జీవితం కావాలని అడిగారు.
రోడ్లు అడిగారు, కరెంటు,నీరు,విద్య , ఉద్యొగ కల్పన అడిగారు.
కానీ
అవి కాకుండా ఇదేమి విచిత్రం.
అసలు మనం ఎటు పోతున్నాం.
అసలు సంఘర్షణ లేని జీవితం ఒక జీవితమేనా ?
Is it worth living ???
ఒక గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాలంటే “సంఘర్షణ”
ఒక లాల్ బహదూర్ శాస్త్రి ఒక ప్రధాని పీఠం దాకా రావాలంటే “సంఘర్షణ ”
ఒక టీ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యడంటే అతను పడ్డ తపన “సంఘర్షణ ”
తన కలలు పండించుకోవడానికి ఒక “కలామ్ ” పడ్డది “సంఘర్షణ ”
మనిషి ఎదగాలంటే కావాల్సింది సంఘర్షణ!
పథకం చూడటానికి గొప్పదే
ఇప్పటికే ప్రతి రంగం లోను పని చేసేవారు లేక కుదేలయిపోయింది !
వ్యవసాయానికి కూలీలేడు
కొట్లోకి గుమాస్తా దొరకడు !
పనికి రమ్మంటే ఒక్కడూ రారు ! వచ్చినా సరిగా పని చేయరు.
మనిషిని పనికి పురికొల్పేది అతని ఆకలే ! ఆకలి తీర్చాలి !
కానీ ఉచితంగా కాదు ! అది తీరేమార్గం చూపించాలి !
చైనా లో ఒక సామెత. ఆకలితో ఉన్నవాడికి చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పండి.
అతనికి ఎప్పుడు ఆకలేసిన, ఆకలి తీరుతుంది.
అంతే గాని అన్ని ఉచితంగా ఇస్తాను. ఏమిటిది ???
ఎవరికి ఉచితమివ్వాలి?
పని చేసుకోలేని వారికి ,వృద్ధులకు ,అనాధలకు అభాగ్యులకు.
వారికి చేయూతనిచ్చే వ్యవస్థ ను రూపొందించండి.
అందరికీ అన్నీ ఉచితం అని సోమరిపోతులను తయారుచేయవద్దు !
పనిచేయని వాడికీ, పని చేసే వాడికీ కూడా ప్రభుత్వమే అన్నీ సమకూరుస్తే, చివరకి పని చేసే వాడు కూడా పని చేయడం మానేస్తాడు. వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుంది,
ఆలోచించండి… ప్రజలారా…. ఉచిత మేధావులరా…
learn from Venezuela
ఇట్లు
రిజర్వేషన్ లేని సగటు భారతీయుడు
– ఎం.రఘువంశీ