– ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు
పేద దళితుల్లో కొత్త జీవితాలు ప్రసాదించేందుకు దేశంలోనే తోలి సారిగా దళిత బంధు పధకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టారని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో దళిత బంధు పధకం అమలును పద్మారావు గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోందని వివరించారు. దళిత కుటుంబాలకు దళిత బంధు వర ప్రసాదంగా నిలుస్తుందని, జంట నగరాల్లో ఈ పధకాన్ని సికింద్రాబాద్ నుంచే ప్రారంభించడం ప్రశంసనీయమని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
25 మంది లబ్ది దారులకు వాహనాలను ఈ సందర్భంగా అందించారు. జిల్లా కలెక్టర్ శ్రమన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, శ్రీలింగాని ప్రసన్న లక్ష్మి, తెరాస కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, కరాటే రాజు, రాజ సుందర్,జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ప్రగతి ప్రారంభం
పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా అధికారుల బృందాలు సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, సీతాఫలమండి, బౌద్దనగర్ డివిజన్ల పరిధుల్లో 121 బస్తీలు, కాలనీల్లో రానున్న 15 రోజుల పాటు పర్యటిస్తాయని ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పద్మారావు గౌడ్ శుక్రవారం లాంచనంగా ప్రారంభించారు.
సీతాఫలమండి లో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ, గతంలో పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో 9 కోట్ల రూపాయలకు పైగా పనులను చేపట్టామని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని సందర్శించి స్థానిక సమస్యలను పరిష్కరించాలని అయన అధికారులను ఆదేశించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి, రాసురి సునిత, డిప్యూటీ కమీషనర్ దశరద్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్ గౌడ్, ఈ ఈ ఆశలత, డిప్యూటీ జీ ఎం వై కృష్ణలతో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.