-జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ దోషులను ఎందుకు అరెస్ట్ చేయరు?
-మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు
-టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకలను పాతరేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటాం…
• జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయడం గర్హనీయం.
• ఈ అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఈ కేసులో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉందని తెలిసినా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు? పైగా ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేసేలా కేసులు పెట్టడం టీఆర్ఎస్ అరాచకాలకు పరాకాష్ట.
• కేసీఆర్ పాలనలో అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాము ఏ తప్పు చేసినా చెల్లుపోతుందని….భావనతో అధికార పార్టీ నేతలుమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వ చేతకానితనమే.
• టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదు. నమ్మిన సిద్దాంతాల కోసం…. పేదల పక్షాల పోరాడే తత్వం బీజేపీ సైనికులకే సొంతం. టీఆర్ఎస్, మజ్లిస్ అరాచకాలపై పోరాడుతున్న తనపైనా కేసీఆర్ సర్కార్ అనేక కేసులు పెడుతోంది. అయినా భయపడే ప్రసక్తే లేదు. అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల లాఠీఛార్జీలు, కేసులకు భయపడే వెనుకంజ వేసే ప్రసక్తే లేదు. దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుంది.