Suryaa.co.in

Andhra Pradesh

గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

-సంక్షేమ పథకాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 
-మంచినీటి సమస్య పరిష్కారానికి బూస్టర్లు ఏర్పాటుకు కృషి
-రానున్న రోజుల్లో ప్రజలందరికీ మరింత మెరుగైన సౌకర్యాలతో సంక్షేమ పథకాల అమలుకు కృషి
-ఇల్లు ఇస్తాము అని చెప్పి ప్రజల సొమ్ము కాజేసిన దుర్మార్గుడు చంద్రబాబు
-చంద్రబాబు అవసరం ఇంకా ఈ రాష్ట్రానికి లేదని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు
-రానున్న 30ఏళ్లు జగనే ముఖ్యమంత్రి
-మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

స్థానిక 55వ డివిజన్ లోని 173వ సచివాలయం పరిధిలో 23వ రోజు గురువారం నాడు గడప గడపకు మన ప్రభ్యుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని బడే సాహెబ్ వీధి,కట్టా వారి వీధి,కొప్పుల వారి వీధి,ఏనుగుల వారి వీధి,ఇస్మాయిల్ వీధి,నూకల వారి వీధి, మదిరి వారి వీధి మరియు తదితర ప్రాంతాలలో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పరంగా జరిగిన సంక్షేమ పథకాల వివరాలు తెలియచేస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడుతూ ఈ సచివాలయం పరిధిలో రొండో రోజు పర్యటించడం జరిగిందన్నారు.ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం పరుస్తున్నారన్నారు.గ్యాస్,పెట్రోల్ ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలుపుతున్నారు అది దేశ వ్యాప్తంగా వున్న సమస్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పేట్టి ధరలు నియంత్రణ చేయాలన్నారు.కొంత మంచి నీటి సమస్య వుంది దాని పరిష్కారం కోసం బూస్టర్స్ ఏర్పాటు చేసి నీటి పైపులు కూడా మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.రానున్న రోజుల్లో ప్రజలందరికీ మరింత మెరుగైన సౌకర్యాలతో సంక్షేమ పథకాల అమలుకు కృషి జరుగుతుందన్నారు.

ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఇవ్వని పథకాలు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారన్నారు.చిన్న పిల్లల చదువు కోసం చంద్రబాబు ఎప్పుడైనా సహకారాన్ని అందించాడ అని ప్రశ్నించారు.నాడు నేడు పేరుతో జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.అనేక పథకాల ద్వారా పిల్లలు చదువుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.ఇల్లు ఇస్తాము అని చెప్పి ప్రజల సొమ్ము కాజేసిన దుర్మార్గుడు చంద్రబాబు అన్నారు.ప్రజలందరికీ ఇల్లు ఇవ్వాలని ఉద్యశంతో అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చిని ఘనత జగన్ ది అని కొనియాడారు.నూతన పెట్టిన వ్యవస్థ అయిన వాలంటీర్స్ మంచి ప్రజలకు సేవా చేస్తున్నారన్నారు.చంద్రబాబు అవసరం ఇంకా ఈ రాష్ట్రానికి లేదని ఈ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు.ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి దిక్సూచి అని గుర్తించి అధికారం అప్పజెప్పారు కాబట్టే జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు.

ఇంకా 30ఏళ్లు జగనే ముఖ్యమంత్రి అని అశాభావం వ్యక్తం చేశారు.చంద్రబాబు ఇంకా ఈ రాష్ట్రానికి పనికి రాని వ్యక్తి అని అన్నారు.కుల మతాలకు అతీతంగా పార్టీలకు సంక్షేమ పథకాలు అందచేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,ఎమ్మెల్సీ రూహుల్లా,55వ డివిజన్ కార్పొరేటర్ శీరంసెట్టి పూర్ణా పల్లె బాబు, షేక్ సలీమ్,డేవిడ్,రమేష్ రాజు,సుభాని ఖాన్, గని,కూరపాటి అనంత్ బాబు,వెంకట లక్ష్మీ,ఏనుగుల భవాని,బాషి,సోమి రాజేష్,జీవన్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,వివిధ కార్పొరేషన్ల చేర్మెన్లు,డైరెక్టర్లు,పార్టీ నాయకులూ, కార్యకర్తలు సచివాలయ సిబ్బంది వాలంటరీస్ మరియు నగరపాలక సంస్థ మరియు రెవిన్యు అధికారులు తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE