– అధిష్ఠానంతో ప్రతిసారీ పోరాడలేను
– నాకు బాధ్యత ఇవ్వకుండా ఎలా పనిచేసేది?
– గన్నవరం ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత యార్లగడ్డ వ్యంగ్యాస్త్రాలు
గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కోల్డ్‌వార్ ముదురుపాకానపడుతోంది. సలహాదారు సజ్జల పిలిచి సర్దిచెప్పినా అటు ఎమ్మెల్యే వంశీ, ఇటు యార్లగడ్డ వెంకట్రావు ఎవరూ వినే పరిస్థితి లేదు. ఎవరూ తగ్గడం లేదు. ఈ క్రమంలో తాను గత ఎన్నికల్లో ఒక విలన్‌పై పోటీ చేశానంటూ యార్లగడ్డ చేసిన తాజా వ్యాఖ్య, గన్నవరం వైసీపీలో కొత్త ముసలానికి కారణమయింది. నాకు బాధ్యతలు అప్పగించకుండా ఎలా పనిచేయాలన్న యార్లగడ్డ ప్రశ్న, అటు వైసీపీకి సూటిగా తగిలింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక విలన్ తో పోటీ చేశానని. అతన్ని పార్టీలోకి తీసుకునే సమయంలో వ్యతిరేకించాను.. ప్రతిసారి నేను అధిష్టానంతో పోరాటం చేయలేనని గన్నవరం నియోజకవర్గ వైకాపా నాయకులు యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై హాట్ కామెంట్స్ చేశారు.
హనుమాన్ జంక్షన్ లో దుట్టా రామచంద్రరావు అహ్వనం మేరకు, అను సీతామహాలక్ష్మీ సూపర్ సెష్పాలిటి ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమంలో యార్లగడ్డ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నేను నిత్యం కార్యకర్తలతో అందుబాటులో ఉన్నాను. వారు ఏ శుభ , అశుభ కార్యక్రమాలకు అహ్వనించిన పాల్గొంటున్నాను అన్నారు. నా వ్యక్తిగత పని మీదా ఒక 6 నెలల అమెరికా వెళ్లాను. ఆ సమయంలో ఎంతోమంది నాపై దుష్ప్రచారం చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసేది అనేది అధిష్టానం నిర్ణయస్తుందని ఉహగానాలు అనవసరమని కొట్టిపడేశారు.జగన్మోహన్ రెడ్డి నాకు కెడిసిసి ఛైర్మన్ పదవి ఇచ్చారు. 11 నెలలు పాటు కష్టపడి పనిచేసి ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి 43శాతం వృద్ధి సాధించే విధంగా కృషి చేశానన్నారు.
నాకు ఏదైనా బాధ్యత ఇస్తే పని చేసి చూపిస్తాం. ఇవ్వకుండా ఎలా పనిచేసిదని అన్నారు. నాపై ఎంతో మంది ప్రచారం చేస్తున్నారు వాటి అన్నింటికీ సమాధానం చెప్పలేను అన్నారు. నేను నియోజకవర్గ ఇంచార్జి ఉన్నప్పుడు ఒక తట్టమట్టి తవ్వలేదు. కనీసం ఒక్క పైసా అవినీతికి పాల్పడలేదు. మట్టి తవ్వినట్లు నిరూపిస్తే దేవుడు దగ్గర ప్రమాణం చేయటానికి నేను సిద్ధం.. రాజకీయ చేయాల్సిన సమయంలో రాజకీయం చేస్తాను.
టీడీపీ నేతలతో మంతనాలు జరిపానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను పార్టీలోకి తీసుకవచ్చారని అయన వెంట నడుస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటి చేస్తారు… ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారని నా పై ఇంతమంది ప్రచారం చేస్తున్నారు కాబట్టే, నా ఇమేజ్ బాగా పెరిగింది అనుకుంటున్నాని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.