Suryaa.co.in

Telangana

కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదు

– బ్రహ్మానందం రేడియేటర్ సినిమా లా ఉంది ..కేసీఆర్ పరిస్థితి
– ప్రజలే టిఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారు
– కేసీఆర్ మాటలు చిత్తు కాగితం తో సమానం
– 15న హైదరాబాద్ బచావో నినాదం తో శాంతి భద్రతల పై అఖిలపక్షం
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. అడుగడుగునా హత్యాచారాలు జరుగుతున్నాయి. కుటుంబాలకు,మహిళలకు భద్రత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వంలోని పెద్దలే హత్యాచారాలు చేస్తున్నారు. అసదుద్దీన్ ఒవైసీ మైనర్ హత్యాచారం పై ఇప్పటికి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజుకి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనర్ హత్యాచారం పై నోరు మెదపలేదు.

హత్యాచారాలు కూడా టిఆర్ఎస్,mim కలిసి పంచుకుంటున్నాయి. ఎలాంటి నేరాలు ,ఘోరాలు చేసిన శిక్షలు మాఫీ అన్నట్లు అసదుద్దీన్ వ్యవహరిస్తున్నాడు. మిత్రపక్షమైన mim నేతలు హత్యాచారం చేస్తే, ఎందుకు శిక్షించడం లేదో కేసీఆర్ మాట్లాడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. ఈ నెల 15న హైదరాబాద్ బచావో నినాదం తో హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతల పై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదు.ఇతర రాష్ట్రాల లో కలిసివచ్చిన నేతలు కేసీఆర్ ను జోకర్ గా చూస్తున్నారు.దేశ రాజకీయాల పై కేసీఆర్ కు మక్కువ ఉంటె..నెల్లూరు జిల్లా లో జరగబోయే ఉప ఎన్నికలో పోటీ చేస్తారా? అక్కడ అభ్యర్థి ని నిలబెట్టి , ప్రచారం చేస్తార? రాష్ర్టపతి ఎన్నికల్లో తన పాత్ర ను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారు.

కేసీఆర్ వ్యవహారం అత్తారింటికి దారేది సినిమా లో బ్రహ్మానందం లా ఉంది. బ్రహ్మానందం రేడియేటర్ సినిమా లా ఉంది ..కేసీఆర్ పరిస్థితి. కొంత కాలానికి ప్రజలే టిఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇస్తారు గజ్వేల్ ఫాంహౌస్ కేసీఆర్ ప్రపంచం. కాంగ్రెస్ లేనప్పుడు.. కాంగ్రెస్ పొత్తు కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నారు. పదిమంది ఎంపీలు లేని టిఆర్ఎస్ కాంగ్రెస్ లేదంటే అయిపొద్దా?. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినా…పోటీ చేయాల్సింది తెలంగాణ లోనే కదా? కేసీఆర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్తడు..అలాంటివి సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు. కేసీఆర్ మాటలు చిత్తు కాగితం తో సమానం.

LEAVE A RESPONSE