– జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మనోహర్
రైతుల కుటుంబాలను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు.76 మంది ప్రకాశం జిల్లాలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.19న పర్చూరు నుండి యాత్ర ప్రారంభమవుతుంది. రైతాంగానికి భరోసా కల్పించలేక పోగా ప్రభుత్వమే భీమా పథకాన్ని స్కామ్ గా మార్చేశారు.సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు రైతులపై పరిజ్ఞానం లేదనుకుంటున్నాను.సాగు కోసం కౌలు రైతులు పడుతున్న కష్టాలను సిఎం గుర్తించలేకపోతున్నారు. కౌలు రైతులు 53 000 మందే గుంటూరు జిల్లాలో ఉన్నారు. వారానికి ఐదారుగురు కౌలు రైతులు పల్నాడులో ఆత్మహత్య చేసుకున్నారు.రైతు భరోసా కు కేంద్రం నిధులిస్తుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాన్ని సిఎంనే స్వయంగా అభినందించాలి. ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు కూడా చెల్లించడం లేదు. అగ్ర కులాలకు చెందిన వారంటూ రైతులకు రైతు భరోసా ఇవ్వటం లేదు.