Suryaa.co.in

Telangana

రేవంత్​ రెడ్డి అరెస్ట్​

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన అల్లర్లలో చనిపోయిన వరంగల్ కు చెందిన ఆర్మీ ఉగ్యోగ అభ్యర్థి రాకేశ్ అంతిమ యాత్రలో పాల్గొని వాళ్లను పరామర్శించేందుకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రేవంత్ కాన్వాయ్ ని ఘట్ కేసర్ టోల్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా వరంగల్ వెళ్లేందుకు అనుమతించడం లేదని చెప్పారు. అనంతరం రేవంత్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ఘట్ కేసర్ లో నిరసన చేపట్టారు.

మరోవైపు భారీ భద్రత నడుమ వరంగల్లో రాకేశ్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఎంజీఎమ్ ఆసుపత్రి నుంచి మొదలైన రాకేశ్ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE