Suryaa.co.in

Andhra Pradesh

కౌలురైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

* రైతు మరణాలను అవమానపరిచేలా మాట్లాడిన సీఎం క్షమాపణ చెప్పాలి
* బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలతో కలిసి కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన అనంతపురం జిల్లా నాయకులు

సాగు నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను అసలు వాళ్ళు రైతులే కాదంటూ అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ డిమాండ్ చేశారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబాలను రూ. 7 లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి… హేళనగా మాట్లాడం సబబు కాదని హితవు పలికారు.సోమవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మరణించిన కౌలు రైతుల కుటుంబాలతో కలసి కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి, వరుణ్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కౌలు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోకపోగా వారి మరణాలను అవమానించేలా మాట్లాడటం భావ్యం కాదు. ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు చాలా హేయంగా ఉంది. ప్రభుత్వం చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ ఒక్కరే చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతులను గుర్తించి వారికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, వీర మహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి, జిల్లా నాయకులు ఆకుల ఉమేష్, సాకే పవన్ కుమార్, పొదిలి బాబురావు, జయరాం రెడ్డి, అంకె ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE