మైఖేల్ జాక్సన్ మరణించిన రోజు
నేనాడితే లోకమే ఆడదా..
నిజమే..మైఖేల్ జాక్సన్
చిందేస్తే థియేటర్లు దద్దరిల్లాయి..
చలికి కొంకర్లు తిరిగినట్టు
సంగీతానికి ఆయన మేను వంకర్లు తిరిగిపోతుంటే
అసలు ఈ మనిషికి
ఒంట్లో దుమ్ములున్నాయా
అని నివ్వెరపోయింది లోకం
కమ్మేసి అతగాడి మైకం..!
ఆయన విల్లా
పదిహేను
గ్రామీ అవార్డుల ఖిల్లా..
బ్రిట్ అవార్డులు ఆరు
ఆయన వాకిట
అందంగా అలరారు..
గిన్నిస్ రికార్డులు
ముప్పై తొమ్మిది…
అలా నిండిపోయింది
అతడి అమ్ముల పొది..!
ఆఫ్ ది వాల్..బీట్ ఇట్..
బిల్లీ జీన్..ద్రిల్లర్..
స్టెప్పులు..గెటప్పులు..
మేకప్పులు..పికప్పులు
ఎగిరిపోయే పైకప్పులు…
అసలు ఆయన ఏం చేసినా
రికార్డే.. వెన్నంటి అవార్డే..
అతడు కనిపెట్టిందే
మూన్ వాక్..జనాలు క్రాక్..
అదో షేక్..
రాక్ ప్రపంచంలో అతగాడు
తిరుగులేని రారాజై..
సంగీతమే సంపదై..
డాలర్ల వరదై..
ఒక తరానికి జాక్సన్ దేవుడు
ఇది ఫిక్స్…!
ప్రపంచాన్ని ఊపేసిన లయ
కమ్మేసిన మైఖేల్ మాయ..
వివాదాలు ముదిరినా..
రాజీలు కుదిరినా..
వ్యక్తిగత జీవితం చెదరినా..
ఎవరు ఏమన్నా..
ఏమనుకున్నా..
ఎన్నన్నా..
అది మైఖేల్ శతాబ్దం..
అతడి విషాదాంతంతో
సంగీత ప్రపంచంలో ఎడతెగని నిశ్శబ్దం.
సురేష్ కుమార్ e
9948546286