Suryaa.co.in

Features

ఆశయాల కాంక్షలతో

భవంతి కైనా,
వ్యక్తి ఎదుగుదల కైనా,
సమాజ పురోగతి కైనా
పునాది గట్టిగా ఉండాలి…..!!

నిరుద్యోగం , పేదరికం ,
నిరక్షరాస్యత వంటి
సామాజిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ….

మాదక ద్రవ్యాలు ,
మద్యపానం, ధూమపానం లాంటి
వ్యసనాల ఊబిలో చిక్కుకున్న
నేటి యువతరం
నాశనం దిశగా గమనం…!!

మాదక ద్రవ్యాలపై
అగ్రరాజ్యాలు
దాదాపు యుద్ధమే చేస్తుంటే
మన దగ్గర ఆ దిశగా
కనీస సన్నద్ధత సైతం
కనుచూపుమేరలో కనిపించక వినియోగంలోనే కాదు
మాదకద్రవ్యాల ఉత్పత్తిలోనూ
తరగని అపకీర్తిని
మూటకట్టుకోవడం ఆందోళనకరం…!!

యువకులు గంజాయికి
ఆకర్షితులై …..
తెలుగు రాష్ట్రాలు
“మాదక ఖడ్గం” కోరల్లో విలవిలలాడుతున్నాయి….!!

మాదకద్రవ్యాల
బెడద నివారణకు
రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రత్యేక విభాగాలు
ఏర్పాటు చేయటం….

లక్ష్యం లేని దర్యాప్తు సంస్థలు
ఇకనైనా మేల్కొని
దిద్దుబాటు చర్యలు
చేపట్టినప్పుడే
యువతరం భవిష్యత్తు మెరుగుపడుతుంది గుణాత్మకంగా…!!

ఆనాడే….
తొణిగిసలాడే ఆత్మగౌరవంతో…..
పంచేంద్రియాలను
పరిపూర్ణంగా సంస్కరించు కొని
“ఆశయాల కాంక్షలతో”
నిండిన యువ రక్తం
రెక్కలు విప్పిన విహంగంలా…. అంబరాన్ని తాకుతుంది……!!

– నలిగల రాధికా రత్న

LEAVE A RESPONSE