Suryaa.co.in

Telangana

“నేను ఉన్నాను- నేను వస్తాను”

-మీ భూముల కోసం పోరాడడండి
-భూ బాధితులకు సీఎల్పీ నేత భట్టి భరోసా

“నేను ఉన్నాను- నేను వస్తాను. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపైన సర్వహక్కులు మీవే. ఆ భూములను లాక్కోవాలని ఎవరు ప్రయత్నించినా తిరగబడండి. మీకు అండగా నేను ఉన్నాను. మీ భూముల సంరక్షణపై పోరాటం చేయడానికి నేను వస్తానని” భూ బాధితులకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు.

పేదలకు బలహీనవర్గాలకు కాంగ్రెస్, గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను అభివృద్ధి అవసరాల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడాన్ని భట్టి తీవ్రంగా ఖండించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు పేదలకు మూడు ఎకరాలు భూ పంపిణీ చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లల్లో నివసించడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రకటించి ఎనిమిదేళ్లు కావస్తున్న అమలు చేయలేదని విమర్శించారు.

ఇచ్చిన హామీ ప్రకారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, భూ పంపిణీ చేయకపోగా ఇప్పుడు క్రీడా ప్రాంగణాలు, తహాశీల్దార్ కార్యాలయాలు, కలెక్టరేట్ ఇతర అవసరాల పేరిట గత ప్రభుత్వ హయాంలో పంపిణీ చేసిన భూములను సంబంధిత లబ్ధిదారుల నుంచి బలవంతంగా టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోవడం తప్పు పని చేస్తున్నదన్నారు. తినటానికి తిండి లేని వారికి, ఉండటానికి ఇల్లు లేని వారికి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను, ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవడం అంటే వారి ప్రాణాన్ని లాక్కున్నట్టే అని అన్నారు. ఇలా చేయడం బాధ్యత కలిగిన ప్రభుత్వం పని కాదని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను తీసుకుంటే క్షేత్రస్థాయిలో ఉద్యమించి ఆ సమాచారాన్ని తన కార్యాలయానికి రాతపూర్వకంగా

భట్టి విక్రమార్క మల్లు
తెలంగాణ కాంగ్రెస్ శాసనసనేత
సీఎల్పీ కార్యాలయం, అసెంబ్లీ
హైదరాబాద్ చిరునామాకు లేఖ పంపించాలని కోరారు. భూ బాధితుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని పేదలు ధైర్యంగా ఉండాలన్నారు.

LEAVE A RESPONSE