Suryaa.co.in

Political News

రాష్ట్రానికి ఏమైంది.!?

చిన్నప్పుడు చూసిన పాతాళభైరవి..
ఆ తర్వాత బస్తీలో భూతం
ఆకట్టుకున్న జీబూంబా..
మొదటది అడిగితే
ప్రసాదించే దేవత
రెండోది అడక్కుండానే
ఇచ్చే దీపం..
ఈ రెండింటినీ మించి
ఎవరికి,ఎందుకు,ఎంత
ఇస్తున్నారో తెలియని
ఓ ఏలిక ఉన్నాడిక్కడ
ఏం చేస్తున్నాడో
తనకే తెలియక..
ఉద్ధరింపు అనుకునే అనుభూతి..
అతడే నవయుగ
ఆషాడభూతి..!

ఒకటే పంపిణీ..
ఒకటిన ఫించనుతో బోణీ
నెల పొడుగునా
పంపకాల మేజువాణి..
ఒక పక్క ఖాళీ ఖజానా
అప్పులే నజరానా
మరోపక్క ఉచితాల జాతర
అభివృద్ధికి పాతర..!

అసలేం జరుగుతోందో తెలియని అయోమయం
“జగ”మే మాయం
గెలిపించడమే తీరని గాయం
అన్నపూర్ణ బ్రతుకు
విషాద గేయం..!

రాజధానిలో రగులుతున్న రావణకాష్టం..
రోదనలో రైతు..
ప్రభుత్వంలోని పెద్దలు
సంబరంతో రాక్షస కవాతు..
అక్కడ రామా
అంటే బూతు..
అధినేతేమో మూడుకాళ్ళ
గుర్రంపై సవారీ చేసే నిర్లక్ష్య..
నిర్దాక్షిణ్య రాతియుగపు రౌతు..!

జీవితంలో సగం
ఆందోళనలతోనే సరి
అప్పుడు కలిసుందామని
ఇప్పుడు విడగొట్టద్దని..
అప్పుడు సోనియా మానియా
ఇప్పుడు మహానేతకు
భజన బృందం తాలియా..
ఎందుకొచ్చిందో ఆలోచన..
ఎప్పటికో ఈ రాష్ట్రానికి విమోచన..!?

గ్రామ సచివాలయాలు
అప్పుడే అక్రమాల ఆశ్రమాలు..
కార్యదర్శులా..కార్యకర్తలా..
గ్రామానికి ధర్మకర్తలా..
అధికారపార్టీకి ఆపద్ధర్మకర్తలా
అవినీతి చక్రవర్తులా..!

మొత్తానికి పొగాకు ప్రకటనలా..
ఏమయింది ఈ రాష్ట్రానికి…
ఒకవైపు రాజధాని పోరు..
మరోవైపు అవినీతి హోరు..
పట్టించుకోని సారు..
మానవరూపంలోని
డైనోసరు..
ప్రతివోడు ప్రతినాయకుడే..!
వెర్రి తలకెక్కి..
అభివృద్ధి అటకెక్కి..
దరిద్రం చంకనెక్కి..
హోదా పాడెనెక్కి..
ప్యాకేజీ చెట్టెక్కి..
అన్నదాత రోడ్డెక్కి..
కేంద్రం మన పీకనొక్కి..
తెలుగోడు బక్కచిక్కి
గుక్కపట్టి శోకిస్తుంటే
పాలకులు నీరోలై..
చేతగాని జీరోలై
ఏడుస్తుంటే మనమంతా
కక్కలేకమింగలేక
మోడీ నవ్వుతూ షకలక
మనకి చెబుతున్నట్టు
లేదా లకలకలలకలక..!?

ఈఎస్కే..

LEAVE A RESPONSE