రాస్తే రావూరి..
భాష మనవూరి..
నీ భాష.. నా భాష..
ఆ కలం మాటాడింది
జనం భాషే..
మమూలు జనం
గుండె ఘోషే..!
భావోద్వేగాలే కథాంశాలు..
చలం ప్రభావం జాస్తి..
ఆయన బాటలోనే కధలు..
తనదైన శైలిలో
సగటు మనిషి వ్యధలు..
సినీ జీవిత తెరవెనక బాగోతాలు పాకుడురాళ్ళు..
మట్టి మనిషి బాధలు..
ఆయన రక్తికట్టించిన గాధలే!
చలంలా సెక్సు కథలూ
రాసిన రావూరి..
ఏదైనా రాయడమే
తన జీవనోపాధి అని ధైర్యంగా చెప్పిన టెంపరి..
ఆ టెంపరితనమే ఆయన్ను
చేసింది చాలా ఉద్యోగాల్లో
టెంపరరీ..అయినా
రాజీ పడని తెగింపరి..
అన్యాయాన్ని ఎదిరించే తగువరి కూడా..
ఎంచనే ఎంచడు తేడాపాడా!
జీవితమంతా పెన్నునే
నమ్ముకున్న మనిషి
ఇమడలేక ఫౌంటెన్ పెన్ను
సంస్థకు కొట్టేశాడు సలాం..
దురాగతాలకు కాలేక గులాం!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286