Suryaa.co.in

Telangana

మధ్యతరగతి జీవితాలపై గ్యాస్ బండ – గుది బండగా మార్చిన మోడీ ప్రభుత్వం

-జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపినాథ్

ఈ రోజు జూబ్లీహిల్స్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ తో కలిసి యూసుఫ్ గూడ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వెతిరేకంగా ధర్నా నిర్వించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి జీవితాలతో చెలగాటడం ఆడుతూ గ్యాస్ ధరలను అమాంతం పెంచిందని మోడీ ప్రభుత్వం అచ్చేదిన్ ఆయేగా అని చెప్పి ప్రజలు సచ్చేదిన్ గ చేసారని మోడీ ప్రభుత్వం మహిళల ఆగ్రహం చవిచూస్తుందని త్వోరలోనే గద్దె దిగిపోవడం ఖాయమని అన్నారు.

పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యుడి జీవితం అతలాకుతలంగా మారిందని అన్నారు బండి సంజయ్ మోడీ ని దేవుడితో పోల్చాడని మోడీ దేవుడు కాదని దేశానికి పట్టిన దయ్యం అని అన్నారు. మోడీ కి దేశ ప్రజలందరూ ఒకటే చెబుతున్నారని బై బై మోడీ అని అంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్తానిక కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజకుమార్ పటేల్, సి ఎన్ రెడ్డి, మన్నే కవిత రెడ్డి, సంగీత యాదవ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, అప్పు ఖాన్, ప్రదీప్, సంతోష్ ముదిరాజ్, కృష్ణ మోహన్, మన్సూర్, విజయ్ కుమార్, తన్ను ఖాన్, విజయ్ సింహ, సిరాజ్ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE