వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. హైదరాబాదు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో తనతో పాటు తన కుమారుడిపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ రఘురామరాజు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. తన కుమారుడు భరత్‌తో కలిసి రఘురామరాజు సంయుక్తంగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
హైదరాబాద్‌లోని రఘురామకృష్ణరాజు ఇంటి సమీపంలో విధి నిర్వహణలో వున్న ఏపీ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌పై.. రఘురామ తనయుడు, భద్రతా సిబ్బంది దాడికి దిగారన్న ఆరోపణలపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రఘురామరాజు, ఆయన కుమారుడు భరత్, రఘురామరాజుకు భద్రత కోసం పనిచేస్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కేసులు నమోదైన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.