– 130 సంక్షేమ పథకాలను మోడీ రాష్ట్రానికి అందిస్తున్నారు
– వైసీపీ రాజకీయ కుతంత్రాల వల్ల 2.68 కోట్ల మందికి ఇబ్బందులు
– బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
– ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని పంపిణీ చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ముందు బిజెపి నిరసన
– ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వాలని డిమాండ్
బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఆరో విడుత ఇవ్వాల్సిన ఉచిత బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా సాకులు చెబుతోంది. ఎఫ్ సి ఐ లెక్కల ప్రకారం 14 లక్షల టన్నుల బియ్యం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాలి. కేంద్రం ఇస్తున్న పదకాన్ని నిందమోపడం సరికాదు. సెప్టెంబరు 22 వరకు మనిషికి 5 కిలోల చొప్పున ఇవ్వాలి. ఏదో ఒక సాకుతో రేషన్ ఇవ్వకుండా తప్పించుకోవాలని చూడకండి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపడం సరికాదు. 130 సంక్షేమ పథకాలను మోడీ రాష్ట్రానికి అందిస్తున్నారు. కానీ నవరత్నాల పేరుతో ప్రభుత్వం ఇచ్చేది తక్కువ, కేంద్ర ప్రభుత్వ పథకాలే అధికం. వెంటనే గడిచిన మూడు నెలల రేషన్ తో సహా సెప్టెంబరు వరకు ఇవ్వాల్సిన రేషన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించి వారి ఆహార భద్రతకు భరోసాని ఇచ్చినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఆంధ్రప్రదేశ్ లో 89 లక్షల కుటుంబాలు, 2.68 కోట్ల మంది జనాభా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సిఐ స్టాక్స్ విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
వైసీపీ ప్రభుత్వ రాజకీయ కుతంత్రాల వల్ల ఆంధ్రప్రదేశ్ లోని 2.68 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేయాలి.
జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ.. కరోనా సమయంలో పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశం తో గరీబ్ కల్యాణ్ అన్న యోజన ప్రారంభించారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యం ను గత నాలుగు నెలలుగా నిలుపుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండింస్తున్నాం. పేద ప్రజలకు కేంద్రం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల కారణంగా పేదలకు అందడం లేదు.
జరుగుతున్న అవినీతిని పలుమార్లు ప్రభుత్వానికి తెలియజేసినా చర్యలు లేవు. రేషన్ బియ్యాన్నే తిని బ్రతికే ఎంతో మంది పేదల ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి పట్టవా? నిలిచిన రేషన్ పంపిణీ కార్యక్రమం వెంటనే చేపట్టాలి ముఖ్యమంత్రి స్పందించి వెంటనే నిర్ణయం తీసుకోవాలి. నిరసన అనంతరం సివిల్ సప్లై జిల్లా సరఫరాల అధికారి ఎస్ పద్మశ్రీకి మెమోరాండం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సివిల్ సప్లై సెల్ కన్వీనర్ బోరుగడ్డ బుల్లిబాబు బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్ యాదవ్, దారా సాంబయ్య, రమా కుమారి, రాచుమల్లు భాస్కర్, కుమార్ గౌడ్, ఈమని మాధవరెడ్డి, కంతేటి బ్రహ్మయ్య, పాలపాటి రవికుమార్, ఈదర శ్రీనివాసరెడ్డి, వనమా నరేంద్ర, సాయి, దేచిరాజు సత్యంబాబు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, ఉయ్యాల శ్యాం వరప్రసాద్, అనుమోలు ఏడుకొండలు, కన్నా రవిదేవరాజు, భాషా, హరికృష్ణ, రోశయ్య, దారా అంబేద్కర్, వీరశేఖర యాదవ్, ఆవుల రామ కోటేశ్వరరావు, యశ్వంత్, ఆవుల నాగేంద్ర, కోక్కెర శ్రీనివాస్, తాను చింతల అనిల్, జాన్ బాబు పంచుమర్తి ప్రసాదు, పద్మనాభం, లక్ష్మణ్, ప్రశాంతి, మంత్రి సుగుణ, కరుణశ్రీ, కోలా రేణుకాదేవి, నాగమల్లేశ్వరి, ఏలూరి లక్ష్మీ, రావూరి లక్ష్మి , ఇతర నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు