Suryaa.co.in

Andhra Pradesh

నోరు అదుపులో పెట్టుకొండి… లేకపోతే తగిన బుద్ధి చెబుతాం

-సీఎం సభకు మాకు పచ్చ బస్సులు అవసరం లేదు
-విశాఖలో భారీ వర్షాల వల్ల స్కూళ్లకు సెలవు ప్రకటించారు
-కనీసం ఆ విషయం కూడా మీకు తెలియదు
-ప్రభుత్వ స్కూళ్లలో చేరండి. జ్ఞానం, ఇంగితజ్ఞానం వస్తుంది
-ఆ స్కూళ్లను మా సీఎం సమూలంగా మార్చేస్తున్నారు
-తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు

తిరుపతి: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే శ్రీనివాసులు ఇంకా ఏం మాట్లాడారంటే..:
మీకు ఈర్ష్య, కడుపు మంట:
టీడీపీ నాయకులు అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారితో అలా మాట్లాడిస్తున్నాడు. ఎందుకంటే, ఇటీవల జరిగిన వైయస్సార్‌సీపీ ప్లీనరీ బాగా విజయవంతం కావడంతో, చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. ఈర్ష్య, కడుపు మంట పెరిగాయి. వచ్చే ఎన్నికల్లో తమ ఓటమి తప్పదని చంద్రబాబుకు స్పష్టమైంది. అందుకే ఈ తరహాలో వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా దూషిస్తున్నారు.

మా కార్యకర్త చాలు:
అసలు ఒకటే అడుగుతున్నాను. అసలు పట్టాభి అనే వాడెవడు? అతడొక పెయిడ్‌ ఆర్టిస్ట్‌. మా పార్టీని, మా ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి అతడికి ఉందా?. మా పార్టీకి చెందిన ఒక చిన్న కార్యకర్త తిట్టిగా ఆయన గాలికి కొట్టుకుపోతాడు. అతడు ఇటీవలే అసభ్య పదజాలం వాడితే, ప్రజలు కోపంతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, భయపడి పారిపోయాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులు, గన్‌మెన్లను పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మా పార్టీని, జగన్‌ని ఎంత తిడితే అంత జీతం పెంచడం, వారికి ప్రైవేటు గన్‌మెన్లను ఇవ్వడం చంద్రబాబు పద్ధతి.

సీఎం సమున్నత ఆశయం:
నిరుపేద కుటుంబాలు బాగు పడాలంటే, వారి బతుకులు మారాలంటే విద్య అవసరమని గుర్తించి, ఆ దిశలో చర్యలు చేపట్టిన ఏకైక సీఎం జగన్‌గారు. ఆ దిశలో ఆయన అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడమే కాకుండా, నాడు–నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మారుస్తున్నాం. ఫర్నీచర్, లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్‌ బోర్డులు, ప్యూరిఫైడ్‌ డ్రింకింగ్‌ వాటర్, రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయిలెట్లు, పెయింటింగ్స్, కాంపౌండ్, కిచెన్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి మొత్తం 10 రకాల పనులతో స్కూళ్ల రూపురేఖలు సమూలంగా మారుస్తున్నాం.

మీకు మళ్లీ భంగపాటు తప్పదు:
దీంతో మీకు దిక్కు తోచక, మైండ్‌గేమ్‌ ఆడుతూ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని 2019లో ప్రజలు ఊడ్చి పారేశారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టారు. గ్రామ, మండల, మున్సిపల్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. అయినా మీరు వైఖరి మార్చుకోవడం లేదు. అందుకే 2024లో కూడా మిమ్మల్ని ప్రజలు తరిమేస్తారు. అందులో సందేహం లేదు.
మీరు విమర్శించాలంటే తగిన కంటెంట్‌ ఉండాలి. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే, వాటిని చూపండి. ఒకవేళ అవి ఉంటే తప్పకుండా సరిదిద్దుకుంటాం. ఈ విషయంలో సీఎం చాలా స్పష్టంగా ఉన్నారు.
ఎల్లో మీడియా ఉంది కాబట్టి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సరిపోదు. ప్రజలకు అన్నీ తెలుసు. వారన్నీ అర్ధం చేసుకుంటున్నారు.

‘వాహనమిత్ర’ పైనా అర్ధం లేని విమర్శలు:
ఇవాళ వాహనమిత్ర. వరసగా నాలుగో ఏడాది అమలు చేస్తున్నాం. విశాఖలో సీఎంగారు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి, నేరుగా 2.61 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో ఏకంగా రూ.261 కోట్ల నగదు జమ చేశారు. అక్కడ అంత గొప్ప పని చేస్తుంటే, ఇక్కడ విమర్శలు చేస్తున్నారు.
అందుకే మీరు చదువుకోవాలి. అప్పుడే అన్నింటి విలువ తెలుస్తుంది. చదువుకుంటే ఇంకా జ్ఞానం వస్తుంది. ఎందుకుంటే మీకు చదువు లేదు. భాషపై పట్టు లేదు. ఇంగ్లిష్‌ రాదు. అందుకే మీరు, మీ లోకేష్‌ మళ్లీ బడికి పొండి. మా సీఎంగారు స్కూళ్లు పూర్తిగా మార్చేస్తున్నారు. చక్కటి భోజనం కూడా పెడుతున్నారు. మొత్తం విద్యా వ్యవస్థనే ఆయన మార్చేస్తున్నారు. అందుకే మీరు బడికి పోతే జ్ఞానం, ఇంగిత జ్ఞానం నేర్పిస్తారు.
మీ మాటలు కొన్ని వింటుంటే, నాలుకకు మెదడుకు సంబంధం ఉండడం లేదు. అలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో ఎక్కడైనా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ కావడం చూశామా? మధ్యవర్తులు, దళారులు, ఎవరి ప్రమేయం లేకుండా, వివక్షకు, అవినీతికి తావు లేకుండా అన్ని పథకాలు అమలు అవుతున్నాయి.

ఆనాడు దోచుకుని.. ఇవాళ:
ఇక మరో వ్యక్తి. నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి. మీ అన్న ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు నీవు విచ్చలవిడిగా దోచుకున్నావు.
ఇవాళ మా ఎంపీ మిథున్‌రెడ్డిని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శిస్తున్నావు. మైనింగ్‌లో మా ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చింది. అర్హులైన వారికి టెండర్‌ వేసే అవకాశం కల్పించింది. గతంలో అలా లేదు. పంచుకో. దోచుకో. నిజానికి ఇలాంటి వారంతా చంద్రబాబు దగ్గరే ఉంటారు. ఎందుకంటే ఆయనా అటువంటి వాడే కాబట్టి.
కిషోర్‌కుమార్‌రెడ్డి పీలేరు వెళితే, ప్రజలు తిప్పి కొడతారు. ఇప్పటికే ఆయనను అక్కడ మూడుసార్లు ఓడించారు. ఇంత జరిగినా, తన్ని తరిమేస్తున్నా, ప్రజలు ఛీ కొడుతున్నా వారికి ఇంకా బుద్ది రావడం లేదు. మాటలు మారడం లేదు. ఏదో ఒక సంచలనం కోసం, మీ పత్రికల్లో హెడ్‌లైన్స్‌ కోసం అలా మాట్లాడితే ప్రజలు అస్సలు క్షమించరు.

మాకు ఆ అవసరం లేదు:
సీఎం వైయస్‌ జగన్‌ది సుపరిపాలన. కోట్లాది మందికి ఆయన అనేక పథకాల ద్వారా మేలు చేస్తున్నారు. పథకాల అమలులో ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ విశాఖలో సీఎం పర్యటనలో తమకు ఎల్లో బస్సులు కనిపిస్తున్నాయని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మాకు ఆ అవసరం లేదు. మా సీఎంగారు పిలుపునిస్తే, లక్షలాది మంది తరలి వస్తారు. అది ఆయనపై ఉన్న ప్రజాభిప్రాయం. అందుకే ఇప్పటికైనా మీరు వాస్తవాలు గుర్తించాలి.
విశాఖలో వర్షాలు కురుస్తున్నాయి. అందుకే అక్కడ పిల్లలు ఇబ్బంది పడతారని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని గుర్తించండి. తెలంగాణలో ఈ వారమంతా సెలవులు ప్రకటించారు.
నిజానికి ఇవాళ వాతావరణం బాగా లేకున్నా, వరద పీడిత ప్రాంతాల్లో సీఎంగారు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆయన ప్రజల కోసం ఎంతైనా కష్టపడతారు. అదే మీరు కరోనా సమయంలో భయంతో హైదరాబాద్‌లో దాక్కున్నారు. రాష్ట్రం నుంచి పారిపోయారు. అదే మా సీఎం నిత్యం ప్రజల కోసం తపిస్తారు. వారి కోసం పని చేస్తారు.

నోరు అదుపులో పెట్టుకొండి. లేకపోతే..:
టీడీపీ నాయకులకు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం. మరోసారి ఇలాగే అసభ్య పదజాలం వాడినా, మా పార్టీని కానీ, సీఎంని కానీ పిచ్చిగా విమర్శిస్తే, మీ నాలుక కోస్తాం. అసలు మీ స్థాయి ఎంత? మా సీఎంని విమర్శించే స్థాయి మీకుందా?.

వారికి ధైర్యం లేదు:
తెలుగుదేశం వారికి పచ్చకామెర్లు. వారికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఒక విషయం గమనించండి. మీరు ఇటీవల ఆత్మకూరు ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయలేదు? కారణం మీకు ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేదు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో పాటు, అనేక పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. నిరుపేదల కుటుంబాలు బాగు పడుతున్నాయి.
అందుకే వారు ఎంత చేసినా, ఏం లాభం లేదు. ఎల్లో మీడియా జాకీలు పెట్టి లేపినా, చంద్రబాబుకు, ఆయన కుమారుడికి ఆదరణ రావడం లేదు. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం. కేవలం ఎన్నికల వరకే మా రాజకీయాలు. ఆ తర్వాత ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. అందుకే ఎక్కడా వివక్ష, రాజకీయాలకు, అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం. అందుకే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు పూర్తిగా ఓడించారు.

LEAVE A RESPONSE