Suryaa.co.in

Features

పురోహితా మేలుకో…

అర్చక పురోహిత పరీక్షలు జూలై 24 25 తేదీలలో దేవాదాయ శాఖ టీటీడీ ఆధ్వర్యంలో ఏమి నిర్వహించట్లేదని దేవాదాయ శాఖ కమిషనర్ స్వయంగా ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. గతంలో ప్రకటించిన సిలబస్ ను పరీక్షలను రద్దు చేస్తూ ఒక అధికారిక ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. అయినా గాని పరువు కోసం, పంతం కోసం మా రాజకీయ ప్రాపకం కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తారు. దయచేసి ఈసారి కూడా మోసపోకండి.

సంఘం తరుపున యధావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షకులకు రావలసిందిగా మళ్లీ మెసేజ్లు, ఫోన్లు చేస్తారు. కావున బ్రాహ్మణ పురోహిత బంధువులారా.. ఏమాత్రం ఉపయోగం లేని పరీక్షలు, ఏమాత్రం ఉపయోగం లేని ఈ సర్టిఫికెట్ల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి డబ్బులు వెచ్చించుకొని, వ్యయ ప్రయాసలతో మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి. మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి. లేదా ఉపయోగం లేని వారు నిర్వహించే పరీక్షలో మీ ఆత్మ ప్రబోధం మేరకు పాల్గొనవచ్చు.

త్వరలో దేవాదాయ శాఖ వారు అధికారికంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మీకు స్థానికంగా ఉన్న వేద పాఠశాలల గురువులు పరీక్షలు నిర్వహిస్తారు. శృంగేరి కంచి విశాఖ శారదా పీఠం తదితర అధికారిక పాఠశాలల వాళ్ళు నిర్వహించే పరీక్షల్లో మాత్రమే పాల్గొని, మీరు నేర్చుకున్న విద్యకు పరీక్షలు రాసి అధికారిక పట్టాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ మోసగాళ్ల మాటలు విని పురోహిత బంధువులు ఎవరు మోసపోవద్దు. మీ సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు.

పౌరోహిత్యం అంటే సమాజంలో యజమానులు గాని, మిగిలిన వారు ఎవరైనా గానీ మనల్ని గౌరవప్రదంగా పిలుస్తారు. అంతే గౌరవప్రదంగా ఆదరిస్తారు. అటువంటి నేపథ్యంలో సమాజంలో మన పురోహిత సంఘానికి నాయకుడిగా, మోసగాళ్లను రాజకీయ బ్రోకర్లను నాయకులుగా చేసుకుంటే సభ్య సమాజం ప్రభుత్వ సంస్థలు అధికారులు అధికార,ప్రతిపక్ష పార్టీ నేతలు అసలు ఎవరూ కూడా మన సంస్థలని నమ్మరు.

అటువంటివారిని నాయకులుగా తీసివేసి గొప్ప గొప్ప పండితులను, సీనియర్ విద్యా గురువులను ఘనాపాటి లను మన సంఘాలకు నాయకులుగా ఎంపిక చేసుకుంటే, సభ్య సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు మన పురోహిత సంఘాన్ని గుర్తిస్తారు, ఆదరిస్తారు. తక్షణమే పురోహిత సంఘ నాయకులుగా ఎవరెవరు ఉండాలో నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత మన పైన మాత్రమే ఉన్నది.

మన పురోహితుల్ని అడ్డం పెట్టుకొని వారి వారి రాజకీయ ప్రాపకాల కోసం మన దగ్గర మాయమాటలు చెప్పి, చిత్తూరు నాగయ్య కమలహాసన్ వంటి జీవ నటులు లాగా నటిస్తూ మాట్లాడి మాయ చేసి రాజకీయ పార్టీల దగ్గర వారి వారి గొప్పతనాన్ని ప్రదర్శించటం కోసం మాత్రమే. మన పురోహితుల్లో ఈ రాజకీయ బ్రోకర్లు దూరి, మన పురోహిత సంఘాలకు డబ్బు ఖర్చు, వివిధ కార్యక్రమాల ఆశ చూపి నాయకులుగా చలామణి అవుతారు.ఇటువంటి వారి పట్ల…. ఓ పురోహితా తస్మాత్ జాగ్రత్త…

పురోహిత చైతన్య వేదిక

LEAVE A RESPONSE