నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు గురువారం విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తమ ముందు విచారణకు హాజరైన సోనియా గాంధీని ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం 3 గంటల పాటు విచారించింది. అనంతరం తొలిరోజు విచారణ ముగిసినట్లు ప్రకటించిన అధికారులు సోనియాను ఇంటికి పంపించారు.
మరోవైపు ఇదే కేసులో ఈ నెల 25న మరోమారు తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులు సోనియా గాంధీకి సమన్లు జారీ చేశారు. విచారణ ముగుస్తున్న సమయంలో సోనియాకు వారు సమన్లు అందజేశారు. ఇదిలా ఉంటే.. ఈడీ కార్యాలయంలో సోనియాను విచారిస్తున్నంతసేపు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా అదే కార్యాలయంలోని వేరే గదిలో వేచి చూశారు.