మన భారతదేశంలోతలసరి ఆదాయం అధికంగా కలిగిన నగరం / పట్టణం ఏది ? అని మనం ఎంబీఏ, ఎంకాం లాంటి చదువులు చదివిన వారిని, లేదా లెక్చరర్లను లేదా ఇతరులను అడిగినా వచ్చే జవాబు ఏది ?
1. ముంబాయి
2. దిల్లీ
3. బెంగళూరు
4. చెన్నై
5. హైదరాబాద్ అనే కదా ?
నిజానికి ఇవేవీ కావు.
దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన పట్టణం పేరు ” మోర్బీ”. గుజరాత్ లోని రాజ్ కోట్ కు 60 కి.మీ. దూరంలో వుంటుంది. ఆ పట్టణం జనాభా [ 2018 లో] 2.4 లక్షలు మాత్రమే. కానీ అందులో 1.4 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు.
మోర్బీ లో
1200 సెరామిక్ యూనిట్లు,
1000 వజ్రాల తయారీ యూనిట్లు ,
1000 textile యూనిట్లు వున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమైన గోడ గడియారాలలో ఒకటైన గోడ గడియారాలను మోర్బీలో కుటీర పరిశ్రమల్లో తయారుచేస్తారు. ఆశ్చర్యమేమంటే దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం (per capita income) వుండటానికి కారణమైన ఈ అన్ని పరిశ్రమలను స్థాపించిన వారికి ఇంగ్లీషు లో ఒక వాక్యం చెప్పడానికి కూడా రాదు. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో 68.5 % మంది 10 వ తరగతి కూడా చదవలేదు.
ఆ పట్టణంలో పర్యటించిన ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఈ మధ్య ఒక ఆసక్తికరమైనమాట అన్నారు : All EMPLOYERS here are UNEDUCATED and all EMPLOYEES here are educated.
తమిళనాడులో తిరుపూర్ పట్టణం వుంది. ఈ ఒక్క పట్టణమే ప్రతి ఏడాదీ 600 కోట్ల రూపాయల గుడ్డలు ఎగుమతి చేస్తుంది. అక్కడ పనిచేస్తున్న వారిలో 68.5 % వ్యక్తులు 5 వ తరగతి దాటలేదు. కేవలం 7 % మంది మాత్రమే డిగ్రీ దాకా వచ్చారు.
ఇంగ్లీషు వచ్చివుండాలి, కోటు, బూటు వేసుకొనివుండాలి, పెద్ద చదువులు చదివివుండాలి … అనే అభిప్రాయాలను తప్పని నిరూపిస్తున్నారు ఇలాంటి అద్భుత విజయాలు సాధిస్తున్న మన వాళ్ళు. Entrepreneurship కు పెద్ద చదువులు, ఇంగ్లీషు అక్కరలేదని తెలుస్తోంది కదా. కానీ, చదువుకోకండి, ఇంగ్లీషు భాషను తరిమివేయండి అని నేను అనట్లేదు. అవి వుంటేనే మనుషులు అన్నంత స్థాయిలో ప్రచారం చేయడాన్ని తప్పు అంటున్నాను. గత కొన్ని దశాబ్దాలుగా మన దేశం కమ్యూనిస్టు ఆర్థికవిధానాన్ని, తరువాత క్యాపిటలిస్టు ఆర్థిక విధానాన్ని అనుసరిస్తూ దెబ్బతినింది.
17వ శతాబ్దంలో ప్రపంచ GDP లో భారత్ వాటా 25 % పై మాటే, అదే సమయంలో ఇంగ్లాండు వాటా కేవలం 1.8 %, అమెరికాది మరీ దారుణం – కేవలం 0.1 % . కానీ ఇపుడు [ 2020-21] లో ప్రపంచ GDP లో భారత్ వాటా కేవలం 3.28% , అమెరికా వాటా అమాంతం పెరిగి 24.5 % అయ్యింది. అంటే అమెరికా అనుసరించే capitalist ఆర్థిక విధానం మంచిది అనికాదు. అది అమెరికా కు suit అయ్యింది. భారత్ కు suit అవ్వదు. అమెరికాకు ఏది మంచిదో అది అందరికీ మంచిది కాదు, రష్యాకు ఏది మంచిదో అది అందరికీ మంచిది కాదు. భారత్ కు ఏది మంచిదో అదే భారత్ అనుసరించాలి. భారత్ కు ఏది మంచిది ?
ఈ ప్రశ్నకు జవాబు స్వదేశీ.
స్వదేశీ అనగానే విదేశీకి వ్యతిరేకం అనికాదు.
నేను నా తల్లిని ప్రేమిస్తాను అంటే, దాని అర్థం నా తండ్రిని ద్వేషిస్తాను అని కాదు కదా !
స్వదేశీ అంటే భారత్ కు మేలుచేసేది,
భారతీయులచేత చేయబడినది,
భారతీయులకోసం చేయబడినది.’
అవసరం అయితే తప్ప విదేశీ వస్తువులు వాడకుండా వుండటం.
దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ ప్రాంతంలో పండే పంటలు ,
వండే వంటలు,
తయారయ్యే వస్తువులు,
పలికే భాష ,
తొడుక్కొనే గుడ్డలు వాడటం.
అమెరికన్లు మనలాగా వుండాల్సిన అవసరం లేదు , మనం ఇంగ్లీషు, అమెరికా వాళ్ళలాగా వుండల్సిన అవసరం లేదు.
అందరూ కాపిటలిస్టు ఆర్థిక విధానమే అనుసరించాలని అమెరికా, కమ్యూనిస్టు విధానమే అనుసరించాలని సోవియట్ రష్యా [ 1990] దాకా మనను ఒత్తిడిచేసాయి.
మన పాలకులు 1947 నుంచీ ఈ రెండింటి మాయలో పడ్డారు. కానీ అది తప్పని , ఆ రెండు ఆర్థిక విధానాలు మనకు మేలు చేయలేదని కాలం నిరూపించింది.
ఇక మిగిలింది మూడవ ఆర్థిక విధానం మాత్రమే. అదే ధార్మిక్ ఎకానమీ.
ప్రపంచానికి మేలు చేయగలిగిన హృదయమూ, సత్తా భారత్ కు వున్నాయి. ఇది ప్రపంచానికి కూడా మేలు చేస్తుంది. ఇప్పుడిప్పుడే భారతదేశంలో మొదలౌతున్నది.
ఇందుకు చక్కటి ఉదాహరణ – పూర్తిగా స్వదేశీ పరిఙ్ఞానం తో మనం తయారుచేసుకొన్న , ప్రపంచంలో 110 దేశాలకూ అందించినకో వ్యాక్సిన్ టీకానే.
అమెరికాకు ఎదురులేకపోతే అది ఒక తాలిబన్ ను , ఆఫ్ఘనిస్తాన్ ను సృష్టిస్తుంది, చైనాకు ఎదురులేకపోతే అది కరోనాను సృష్టిస్తుంది, కానీ, భారత్ బలపడితే అది కో వ్యాక్సిన్ను సృష్టించి ప్రపంచాన్ని ఆదుకొంటుంది.