స్నేహమంటే..
తిరుగుళ్ళు..
ఇచ్చిపుచ్చుకోడాలు..
పరిగెత్తడం..
ఒకరి కోసం
ఒకరు ఎలుగెత్తడం..
త్యాగాలు..
భోగాలు..భాగాలు..
షికార్లు..సినిమాలు..
క్లాసులు ఎగ్గొట్టడాలు..
గోడలు ఎగబాకడాలు..
స్లిప్పులు అందించుకోడాలు..!
స్నేహమంటే..
రోడ్లపై బజ్జీలు..
మురీ మిక్చర్లు..
పానీ పూరీలు..
బస్సు దొరక్కపోతే లారీలు..
ఎంగిళ్ళు తినడాలు..
ఒకే సీసాలో
నీళ్ళు (?)తాగడాలు..
కొత్తకొత్త ఆగడాలు..
ఇంటి నుంచి అమ్మ పంపిన క్యారేజీలు లాక్కొని పంచుకోడాలు..!
స్నేహమంటే
క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు..
ఇంట్లో ఒక చోటికని చెప్పి
మరో చోటుకు వెళ్ళడాలు..
పెద్దోళ్ళకు దొరికిపోతే కవరింగులు..
కొన్ని మంచి పనులు..
ఎక్కువగా వెధవ పనులు..
ఒకరి లవ్వుకు
ఇంకొకరి కోపరేషన్..
దొరికిపోతే పరేషాన్..
అప్పుడు ఇంకో
కొత్త ఆపరేషన్..!
స్నేహమంటే
ఐడియాలు..
సోషల్ మీడియాలు..
రోమియోలు..
రోడ్డు సైడు బీట్లు..
అన్నా..మావా..
భయ్యా.. బావా..
ఇలాంటి చనువైన పిలుపులు..
ఎన్నెన్నో మధురమైన తలపులు..
ఫోన్ కాల్స్..
సంకేతంగా మిస్డ్ కాల్స్..
నో ప్రొటో కాల్స్..!
స్నేహమంటే
ప్రాణం ఇచ్చే మనసు…
పట్టించుకోని వయసు..
కనిపించని ఆలుసు..
అసలు..స్నేహమే
ఓ సొగసు..
అది స్నేహం చేసే
ప్రతి ఒక్కరికి తెలుసు!
స్నేహమంటే..
ఓ కులాసా..
ధిలాసా..
భరోసా..
భిన్న రుచుల సమోసా..
విభిన్న అభిరుచుల పిపాస..
మొత్తంగా..
బంధాల సుగంధం..
అందమైన అనుబంధం..
ఆహ్లాదం పంచే సుమగంధం..
తీయనైన మకరందం..
జీవిత పర్యంతం
వెన్నంటి ఉండే..
ఓ అద్భుతం..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
విజయనగరం
9948546286