-YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
కొడంగల్ మండలం హస్నాబాద్ గ్రామంలో వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు. 8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట గా పాడింది పాటగా సాగింది.కేసీఅర్ ఏం చేసినా ప్రశ్నించే వారు లేరు. మాట నిలబెట్టుకోలేదు అని ఒక్కరైనా ప్రశ్నించారా..? ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నిద్రపోయాయి. ప్రతిపక్షాలు గుడ్డి గుర్రాలకు పళ్లు తోముతున్నాయి. కాంగ్రెస్,బీజేపీ లు ప్రశ్నించి ఉంటే కేసీఅర్ ఆటలు సాగేవి కావు. ప్రజల పక్షాన నిలబడిన పార్టీలే లేవు. ప్రశ్నించడం కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పుట్టింది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు నిద్రపోవడం తోనే కేసీఅర్ పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు. బంగారు తెలంగాణ కేసీఅర్ కుటుంభానికి అయ్యింది.
తెలంగాణ ప్రజలపై కేసీఅర్ నాలుగు లక్షల కోట్ల అప్పు మోపారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. నాలుగు కోట్ల కుటుంబాలలో ప్రతి కుటుంభం పై నాలుగు లక్షల అప్పు ఉంది. నాలుగు లక్షల అప్పు మోపి నాలుగు పైసలు కూడా సహాయం చేయలేదు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు లేదు..మూడెకరాల భూమి లేదు. పిల్లలకు ఫీజులు లేవు .ఆరోగ్య శ్రీ అసలే లేదు. మూడేళ్లుగా పెన్షలకు కూడా దిక్కులేదు. రైతులకు పంట నష్టం జరిగితే పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు. కేసీఅర్ ది దిక్కుమాలిన పాలన. ఈ దిక్కుమాలిన పాలన లో రైతులు 59 ఏళ్లకే చనిపోవాలట..అట్లా అయితేనే రైతు భీమా ఇస్తారట. కేసీఅర్ బాత్ రూములో బుల్లెట్ ప్రూఫ్ గోడలట. రైతు ప్రాణాలకు విలువ లేదు కానీ..కేసీఅర్ ప్రాణాలకు మాత్రం ఇంత విలువ నా..?. ఓట్లు కావాల్సిన ప్రతి సారి కేసీఅర్ వస్తారు…గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తారు. అవసరం తీరాక…బోడి గుండె. 8 ఏళ్లలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు. ఓటు అనేది ఒక ఆయుధం. ఈ సారి మీకోసం పరితపించే పార్టీ కి ఓటు వేయండి. వైఎస్సార్ సంక్షేమ పాలన అందించడం కోసమే పార్టీ పెట్టాం. వైఎస్సార్ ఆశయాలను నెరవేరుస్తామని మాట ఇస్తున్న …