– ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మునుగోడు ప్రజలను మోసం చేయడానికి బీజేపీ టిఆర్ఎస్ లు మరోసారి కుటిల యత్నాలు చేస్తున్నాయి. ప్రజా సమస్యలపై మాట్లాడనుకుండా వ్యక్తిగత దూషణలు, వివాదాలు చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు..
నల్లధనం విదేశాల నుంచి తెచ్చి ప్రతి పౌరుడు ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తా అన్నారు. ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ చెప్పారు. 8 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వకపోగా నిరుద్యోగం విపరీతంగా పెరుగుతున్న ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగిన కూడా ధరలను నియంత్రించి పేదలను అడుకోలేదు.
టిఆర్ఎస్ ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీలు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారి తీస్తుంది.రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్న కు 22 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ కేంద్ర ప్రభుత్వం 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయి.. మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడు. డబుల్ బెడ్ రూమ్, ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.. వారికి ఓటు అడిగే హక్కు లేదు..
ప్రజల పక్షాన ఈ రెండు పార్టీల ను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కి ఉంది. ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడాలి.. కాంగ్రెస్ పక్షాన పేదలు ఉన్నారు.సమస్యలపై చర్చ జరగాలి వ్యక్తిగత విమర్శలు కాదు.
కాంగ్రెస్ శ్రేణులకు సూచన పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ,ట్రిపుల్ ఐటీ, జాతీయ హోదా సాగునీటి ప్రాజెక్టులు, గిరిజన యూనివర్సిటీ.. ల గురించి టిఆర్ఎస్ పోరాటం ఎందుకు చేయడం.లేదు.కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పై మనం పోరాటం చేయాలి. బీజేపీ వైఫల్యాలు ఎండగట్టాలి.
మనం కమ్యూనిస్టు లు, కోదండరాం తో కలుపుకుని పోరాడదాం. సమన్వయం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాడదం. మునుగోడు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ, టిఆర్ఎస్ లకు బుద్ధి చెబుదాం.