Suryaa.co.in

Telangana

కేసీఆర్… సమాఖ్య స్పూర్తి గురించి నీకేం తెలుసు?

• నీకు తెలిసిందల్లా క్లౌడ్ బరస్ట్… జఫర్ సన్ మాత్రమ
• తెలంగాణలో ”రాక్షస పాలన” కొనసాగుతోంది
• ఇక్కడి సీసీ కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నడు
• సీపీ బతుకు కుక్కల చింపిన విస్తరి చేయిస్తాం
• ఖాసీం చంద్రశేఖర రజ్వీ విసునూరు దొర వారసుడు
• కేసీఆర్ రాక్షస రాజ్యాన్ని బొందపెట్టేందుకే ప్రజా సంగ్రామ యాత్ర
• తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం
• ఢిల్లీలో కేసీఆర్ మందు తాగి దీక్ష చేసినట్లు నిరూపిస్తా.. సవాల్ ను స్వీకరిస్తారా?
• పాలకుర్తిలో ‘ప్రజా సంగ్రామ యాత్ర’ బహిరంగ సభ” లో బండి సంజయ్ వ్యాఖ్యలు
• ‘చాకలి ఐలమ్మ మనవడిని సత్కరించిన బండి సంజయ్

పాలకుర్తిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
ఇక్కడ బలవంతంగా షాప్ లను మూయించారు. ప్రగతి భవన్ కో… ఫార్మ్ హౌజ్ కో ఫోన్ చేసి మీ ట్విట్టర్ టిల్లు కు చెప్పండి.. వావి వరసలు తెలియని మూర్ఖులు టీఆర్ఎస్ నేతలు. మా మహిళల జుట్టుపట్టి లాగారు… ఫాల్త్ గాళ్ళు..ఇంకోసారి నా కార్యకర్తలపై దెబ్బ పడితే… బిడ్డా… నీ సంగతి చూస్తాం. నువ్వు ఎర్రబెల్లివో… నల్ల బల్లివి… ఊసరవెల్లివి. పాలకుర్తి గడ్డ పై కాషాయ జెండా ఎగరేస్తాం.

సోమ లింగేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నా… పాలకుర్తి ప్రజల బతుకులు మారాలని. పాలకుర్తి సోమన్న, వాల్మీకి మహర్షి, బమ్మెర పోతన, చాకలి ఐలమ్మ, తాను నాయక్, షేక్ బందగి, దొడ్డి కొమురయ్య నడయాడిన నేల ఇది.తెలంగాణకు ఖాసీం చంద్రశేఖర్ రజ్వి దాపురించాడు. కేసీఆర్ కొడుకు పేరు సయ్యద్ మక్బుల్…అతనే ట్విట్టర్ టిల్లు. విసునూరు రామచంద్రారెడ్డి, బాబు దొర లు ఇక్కడ అరాచకాలు చూపించారు. పాలకుర్తిలో కూడా నిజాం రాజ్యం నడుస్తుంది. అందుకే షాపులను బంద్ చేయించారు.

ఇక్కడ కమిషనరు టిఆర్ఎస్లో జాయిన్ అయి, ఏదైనా పదవి తీసుకోవాలి. పోలీసులను పెట్టి షాపులు బంద్ చేయిస్తారా? పోలీస్ కమిషనర్ కు సిగ్గుండాలి. సీపీ కి దమ్ముంటే కేసీఆర్ దగ్గర పోలీసుల సంక్షేమం పై మాట్లాడాలి. బీజేపీ కార్యకర్తల దమ్మేంటో సీపీకి తెలియదేమో…. గుర్తుంచుకో సీపీ.. కుక్కలు చింపిన విస్తరి లెక్క చేస్తా సీపీ నీ బతుకును. పోలీస్ కమిషనర్ ని చూసి కింది సిబ్బంది, ఛీ.. తూ అంటున్నారు. సీపీ కి దమ్ముంటే రాళ్లు వేసే వాళ్ళను అరెస్టు చేయాలి. టిఆర్ఎస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతుండు పోలీస్ కమిషనర్.పోలీసు వ్యవస్థకే కళంకం తెచ్చాడు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొంద పెట్టడానికే.. బిజెపి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది.

తెలంగాణలో ”రాక్షస పాలన” కొనసాగుతోంది. శ్రీరాముడి వారసుల పార్టీ బిజెపి. పాలకుర్తిలో పేదోళ్ల రాజ్యం రావాలి. పాలకుర్తిలో రాక్షస రాజ్యం నడుస్తోంది. పాస్ పోర్టుల బ్రోకర్ రాజ్యమేలితే ఇలానే ఉంటుంది.. ఇక వాని కింద చేసేటోళ్లది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బీజేపీ యాత్రను అడ్డుకోవాలని చూసిన వాడిని నేను అడుగుతున్నా… పాలకుర్తిలో ‘బమ్మెర పోతన సమాధిని స్మృతివనం చేస్తా’ అన్నారు చేశారా? ఇంటికో ఉద్యోగం… డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, రైతులకు రుణ మాఫీ, దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేశారా? కెసిఆర్ లుచ్చా రాజకీయాలు చేస్తూ… బీజేపీ కార్యకర్తలను కొడుతున్నారు.

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ఎందుకు జరగడం లేదో సమాధానం చెప్పాలి. తెలంగాణ వీరుల చరిత్రను తెలంగాణ సమాజానికి తెలియకుండా చేస్తుండు. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలంటే… బిజెపి నేతలపై లాఠీ ఛార్జ్ చేశారు.

కేసీఆర్ వల్ల తెలంగాణ వచ్చిందా..? ఖమ్మం ఆస్పత్రిలో దొంగ దీక్ష చేసిండు… మందు తాగిండు. మోసం, చీటింగ్ చేయడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్. ఢిల్లీలో కూడా దొంగ దీక్ష చేసిండు. నిన్న బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టించాడు… టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి మమ్మల్ని అడ్డుకుంటే… ఇక్కడి సీపీ మా కార్యకర్తలపైనే కేసులు పెడతారా? టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసురుతున్నా… తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మందు తాగిండని నిరూపిస్తా… కెసిఆర్ కు మందు పోసింది ఎవరో కూడా చెప్తా. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి.

అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే రకం కేసీఆర్ . పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు సుష్మా స్వరాజ్ (బీజేపీ) సపోర్ట్ చేయకపోతే… ఇక్కడ కెసిఆర్ సీఎం అయ్యే వాడేనా? కేసీఆర్ పై సహారా కేసులు ఉన్నాయి.సీబీఐ అంటే ఏంటో తెలిసింది కూడా కేసీఆర్ అవినీతి వల్లనే. అవసరానికి జై తెలంగాణ… అవసరం తీరాక, తెలంగాణ రావద్దని కోరుకున్న మూర్ఖుడు కెసిఆర్. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కి పెట్రోల్ దొరుకుతుంది… హరీష్ రావుకు మాత్రం పెట్రోల్ దొరికినా… అగ్గిపెట్టె దొరకదు.

ఉద్యమకారులకు జన్మనిచ్చిన గడ్డ పాలకుర్తి గడ్డ. తెలంగాణ ఉద్యమ ద్రోహులు, రాక్షసులే… ఇక్కడ రాజ్యమేలుతున్నారు. అరేయ్ అంటే…ఒరేయ్ అంటాం. నీకు సమాధానం చెప్పేందుకు సిద్ధమైన పార్టీ భారతీయ జనతా పార్టీ.. ఎవరికీ భయపడం.. మేము తెగించి కొట్లాడడానికే వచ్చాం. పాలకుర్తిలో భయానక వాతావరణాన్ని సృష్టించి, భయపెట్టాలని చూస్తున్నారు. బీజేపీ భయపడే ప్రసక్తే లేదు. ‘ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం’ చేయాలని కంకణం కట్టుకున్న పార్టీ ‘భారతీయ జనతా పార్టీ’. బానిస, బాంచన్ బతుకుల పోయి, కాలర్ ఎగరేసే బతుకులు రావాలి.

ప్రజల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర. రజాకార్ల వారసుల పార్టీ ఎంఐఎం. రజాకార్ల వారసులను చంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు కెసిఆర్. టిఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు ఒకటే. రాక్షస రాజ్యం పోయి, రామ రాజ్యం రావాలి. పేదల సంక్షేమం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నా. 1400 అమరవీరుల త్యాగాల వల్లనే తెలంగాణ వచ్చింది… కేసీఆర్ వల్ల రాలేదు.

కెసిఆర్ కు ఏం తెలుసు సమాఖ్య స్ఫూర్తి గురించి? జఫర్ సన్ గురించి, క్లౌడ్ బరస్ట్ గురించి మాత్రమే తెలుసు. ప్రజలకు చిప్ప చేతికి ఇచ్చిండు. జీతాలు ఇస్తలేడు. ప్రతి ఒక్కరి నెత్తిపై లక్షా 20 వేల రూపాయలు అప్పు పెట్టిండు. ఈ మూర్ఖుడు ఎనిమిదేళ్లలో ఎన్ని కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇచ్చాడు? కేంద్రం నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది.

కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయడం లేదని మోదీని తిడుతూ… ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు అంతా తెలుసు. కెసిఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. నిరుద్యోగ యువత, ఆర్టీసీ కార్మికులు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? రైతులకు సబ్సిడీపై ఎరువులను ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమే.

పేదలకు రైతుబంధు ఇవ్వని కెసిఆర్… పెద్దోళ్లకు మాత్రమే ఇస్తున్నాడు. ముందు నుంచి నువ్వు జమీందారు అయితే…. చింతమడక లో నీ స్థలాన్ని ఎస్సీ కార్పొరేషన్ కు ఎందుకు అమ్ముకున్నావ్? సంక్షేమ కార్యక్రమాలను మోడీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. పాలకుర్తి వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. పాలకుర్తి ప్రజలకు బిజెపి అండగా ఉంటుంది. దుబ్బాక లో ఓటుకు రూ.10 వేలు, హుజురాబాద్ లో ఓటుకు రూ.20 వేలు ఇచ్చిండు. అయినా ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్పిండ్రు. మునుగోడు లో ఓటుకు రూ.30 వేలు ఇస్తున్నాడు. పాలకుర్తిలో పేదోళ్ల రాజ్యం రావాలి. ‘పోలీస్ కమిషనర్’ ఇక్కడ వ్యాపార సముదాయాలను బలవంతంగా బంద్ చేయించి, నా సభకు రానీయకుండా చేసినా… ఎదిరించి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జర్నలిస్టుల కోసం బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుంది. మీ కోసం బీజేపీ కొట్లాడుతుంది.

ఏ పార్టీ అయినా మీటింగ్ పెట్టుకోవాలి… దాడులు సరికాదు : ఐలమ్మ మనవడు రామచంద్రయ్య
ఈనాడు ఏ పార్టీ అయినా… ఎప్పుడైనా… ఎక్కడైనా… మీటింగ్ పెట్టుకోవచ్చు. కార్యకర్తలు ఎవరైనా సరే… పరస్పరం దాడులు చేసుకోవడం మంచిది కాదు..

ఎర్రబెల్లివి కాదు… ఊసరవెల్లివి : జిల్లా అధ్యక్షులు దశమంతరెడ్డి, స్థానిక నేతలు
అవినీతి దుర్మార్గపు పాలనను అంతమొందించేందుకే… బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. కాకతీయ గడ్డపై కాలు పెట్టిన కారణజన్ముడు… కమల దళపతి బండి సంజయ్ కి స్వాగతం, సుస్వాగతం. పేదల బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బండి సంజయ్. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా…. ప్రజలను సంఘటితం చేసి, ప్రభుత్వం పై సంగ్రామం చేస్తున్న బండి సంజయ్ కి స్వాగతం.

LEAVE A RESPONSE