రాష్ట్ర పరిస్థితిపై ట్విట్టర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రజలకు బాగా తెలుసు. నాడు – నేడు అంటూ పాఠశాలల అభివృద్ధి అని సొంత పార్టీ వాళ్ళను మేపడానికి వాడారు.. ఇప్పుడు తరగతి గదుల్లో పెచ్చులు ఊడి పడుతున్న వార్తలు రోజూ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో 25,000 కిమీ. ల సీసీ రోడ్లు వేశాము. ఈ ప్రభుత్వంలో వేసింది సున్నా.. గత ప్రభుత్వంలో 13 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టి దాదాపు 8 లక్షల ఇళ్లు పూర్తి చేసాము.
ఈ ప్రభుత్వంలో ఇళ్ళ నిర్మాణం లేదు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన లేదు.. కొత్త ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, పంచాయితీ భవనాలు గత ప్రభుత్వంలో కట్టించినవే. ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చిన సచివాలయాలకు అద్దెలు కూడా చెల్లించక భవనాలు అద్దెకు ఇచ్చిన యజమానులు తాళాలు వేస్తున్నారు.
గత ప్రభుత్వాల పాలనలో ఆదాయం మరియు అప్పుల మొత్తంలో మూలధన వ్యయం శాతం ఎంత, ఈ ప్రభుత్వంలో ఆదాయం మరియు అప్పుల మొత్తంలో మూలధన వ్యయం శాతం ఎంత అనేది చూస్తే గత మూడేళ్లుగా అభివృద్ధిలో వెనక్కి అప్పుల్లో ముందుకి వెళ్తున్నాం అని తేలిగ్గా అర్ధమయిపోతుంది. గత 72 సంవత్సరాలలో ఎవరూ చేయని అప్పులు వీళ్ళు కేవలం మూడేళ్లలో మూడు రెట్లు అధికంగా చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి ప్రజల నెత్తిన, పుట్టబోయే బిడ్డల నెత్తిన కూడా అప్పుల భారాన్ని వేశారు. ఈ ముఖ్యమంత్రి అసమర్థ, ప్రణాళిక లేని పరిపాలన వల్లనే రాష్ట్రానికి నేటి ఈ దుస్థితి.