ఇంటర్ విద్యను కార్పొరేట్ కబంధ హస్తాల్లో బంధించిన ప్రభుత్వ వైఖరి ఎండగడుతూ ఆగస్ట్ 23న ఇంటర్ కళాశాలల బంద్
ఇంటర్ విద్యలో కార్పొరేట్ శక్తుల ఆఘాడాలను నిరసిస్తూ ABVP రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో శ్రీ చైతన్య కళాశాల ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ABVP రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ విద్యలో కార్పొరేట్ శక్తులు తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రభుత్వ అనుమతులు లేకుండా,ఇంటర్ బోర్డ్ మార్గదర్శకాలను విస్మరిస్తూ అక్రమంగా సంస్థలు నిర్వహిస్తూ ఇష్టా రీతిన వ్యవహారిస్తున్నారు.
హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో విస్తరించి నారాయణ, శ్రీచైతన్యలకు తోడు మరిన్ని కార్పొరేట్ శక్తులు ఇంటర్ విద్యను తమ కబంధ హస్తల్లో బందించి తప్పుడు ర్యాంక్ లతో ప్రచార అర్బాటాలతో ఒత్తిడితో కూడిన కాసుల చదువులకు విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచులు నిర్వహించినా లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ కళాశాల ఒకటైతే ఫీజు చెల్లించుకునే కంపెనీ మరొకటి, రషీదు ఇంకో సంస్థ పేరున ఇస్తూ నల్లధనం ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుంది. అడ్మిషన్ పొందిన రోజు 60% ఫీజు చెల్లించాలనే షరతు,పుస్తకాలు,యూనిఫామ్ లు తమ ప్రాంగణంలోనే విక్రయించడం నిబంధనలకు విరుద్ధమైనా చర్యలు శూన్యం.
విద్యాసంవత్సరం పూర్తి అయినా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా అధిక ఫీజుల కోసం తీవ్ర వేదింపులకు గురి చేస్తున్నారు.ఈ తరహాలో రామంతపూర్ నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన సాయి నారాయణ స్వామి అనే విద్యార్థి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం కళాశాలకు వెళ్లగా అధిక ఫీజు నమోదు చేసిన యాజమాన్యం పూర్తి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలయాపన చేస్తుండడంతో యజమాన్యం వైఖరిపై విసుగు చెందిన విద్యార్థి విధి లేక తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేయడం అత్యంత బాధాకరమని ఇది కేవలం రామంతాపూర్ కు పరిమితమైన సమస్య కాదని రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇదే విధమైన దుర్మార్గాలు కొనసాగుతున్నాయి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకపోయినా కళాశాలలు, వాటికీ అనుబంధంగా హాస్టల్స్ నిర్వహిస్తూ అధికారులను తప్పు ద్రోవ పట్టిస్తున్న కళాశాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలి.
కార్పొరేట్ శక్తుల ఆఘాడాలను అరికట్టి,అధిక ఫీజులు నియంత్రించేలా ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని అనేక మార్లు పిర్యాదు చేసిన,ఉద్యమాలు నిర్వహించినా చర్యలకు ఉపక్రమించని ప్రభుత్వ, ఇంటర్ బోర్డ్ వైఖరి నిరసిస్తూ రేపు మంగళవారం తెలంగాణ “ఇంటర్ కళాశాలల బంద్” పిలుపునిచ్చారు. ఇంటర్ విద్యను కాపాడుకునేందుకు చేపట్టిన ఈ బంద్ ను విద్యార్థులు తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
డిమాండ్స్
రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ నశించాలి. ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహిస్తున్న నారాయణ శ్రీ చైతన్య సహా ఇతర కార్పొరేట్ కళాశాలలను నియంత్రించాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్న,అనుమతి లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి ర్యాంక్ లను ప్రచారం చేస్తున్న కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. అధిక ఫీజులను నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి.ఇంటర్ కళాశాలలకు అనుబంధంగా హాస్టల్స్ నిర్వహిస్తున్న కళాశాలలలపై చర్యలు తీసుకోవాలి. ఇంటర్ విద్యలో కార్పొరేట్ అఘాడాలు, ఆత్మహత్య లపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి. ఇంటర్ అడ్మిషన్ ప్రక్రియ ఆన్లైన్ లో చేపట్టాలి.