– పోలీసు సిబ్బందికి ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారా లేక జగన్ దోచుకున్న సంపదను జీతంగా ఇస్తున్నారా ?
– తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న
జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే తీరు ఉంటే సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్‌ను చుట్టుముడతామని హెచ్చరించారు.సహనాన్ని పరీక్షిస్తే శ్రీలంకలా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుందన్నారు.శాశ్వత నరకాసుర పాలనను ప్రజలేమీ కోరుకోవట్లేదన్నారు.
జగన్ రెడ్డి కనుసైగలతో పోలీసులు… ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఇదే తీరు కొనసాగితే సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్‌ను చుట్టుముడతామని ఆయన హెచ్చరించారు. తమ సహనాన్ని ఇంకా పరీక్షిస్తే, శ్రీలంకలోలా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుందని అన్నారు.
డీజీపీ తన పోలీసు సిబ్బందికి రాష్ట్ర ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారా లేక జగన్ దోచుకున్న సంపదను జీతంగా ఇస్తున్నారా అని బుద్దా వెంకన్న మండిపడ్డారు.లోకేశ్ శ్రీకాకుళం పర్యటనను అడ్డుకోవటమే కాకుండా విశాఖలో మీడియా సమావేశం అడ్డుకోవడం చూస్తే ఎవరికైనా పోలీసుల తీరుపై అనుమానం కలుగుతుందని విమర్శించారు.
లోకేశ్… జగన్ రెడ్డిలా సొంత బాబాయ్ని హత్య చేయించలేదని, విశాఖలో విజయసాయిలా భూకబ్జాలకు పాల్పడలేదని అన్నారు. గోరంట్ల మాధవ్, కొడాలి నానిల్లా పిచ్చిపట్టినట్లు తెదేపా నేతలు ఎవరూ ప్రవర్తించట్లేదన్నారు. పశువుల మంత్రి పలాసలో స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలని వేధిస్తుంటే, లోకేష్ పరామర్శించాలనుకోవటం తప్పా అని నిలదీశారు.
పరామర్శ అనేది జగన్రెడ్డి పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రి సీదిరి అప్పలరాజు బయటకు రావటానికి భయపడి పోలీసులతో కావాలనే గృహ నిర్బంధం చేయించుకుని కృతజ్ఞతలు తెలిపిన పిరికి వాడని అన్నారు.జగన్ దోపిడీని ప్రశ్నిస్తునందుకే తెదేపా నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారా అని బుద్దావెంకన్న ప్రశ్నించారు. “జగన్ కనుసైగలతో పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారు. ఇదే తీరు ఉంటే సహనం నశించి తాడేపల్లి ప్యాలెస్‌ను చుట్టుముడతాం. సహనాన్ని పరీక్షిస్తే శ్రీలంకలా మరో ప్రజా చైతన్యం చూడాల్సి వస్తుంది. లోకేశ్‌ను అడ్డుకోవడం చూస్తుంటే పోలీసుల తీరుపై అనుమానంగా ఉంది. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే పర్యటనలను అడ్డుకుంటారా?. పరామర్శ అనేది జగన్ పేటెంట్ అని పోలీసులు భావిస్తున్నారా?. శాశ్వత నరకాసుర పాలనను ప్రజలేమీ కోరుకోవట్లేదు.” అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.