న్యూఢిల్లీ : ఎంపీ మాధవ్ వీడియోపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విన్నవించనున్నామని జేఏసీ తెలిపింది. స్పీకర్ ఓం బిర్లాని కలిసి గోరంట్ల మాధవ్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామని వారు వివరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ చేరుకుంది వివిధ మహిళా సంఘాల నేతలతో కలిసి ఉన్న డిగ్నిటీ ఫర్ ఉమెన్ జాయింట్ యాక్షన్ కమిటీ.
డిగ్నిటీ ఫర్ ఉమెన్ కన్వీనర్ చెన్నుపాటి కీర్తి, కోకన్వీనర్ అనిత, కమిటీ మెంబర్ సుంకర పద్మశ్రీ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య సెక్రటరీ రాణి, ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ట్రెజరర్ పుణ్యవతి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్నలతో కూడిన జేఏసీ బృందంతో పాటుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ, తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి, గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మిలతో కలిసి రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్, మహిళా ఎంపీలను కలవనుంది.
ఎంపీ మాధవ్ వీడియోపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి విన్నవించనున్నామని జేఏసీ తెలిపింది. స్పీకర్ ఓం బిర్లాని కలిసి గోరంట్ల మాధవ్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరతామని వారు వివరించారు. గోరంట్ల మాధవ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టే న్యాయం కోసం ఢిల్లీ వచ్చి ఫిర్యాదు చేస్తున్నామని జేఏసీ నేతలు వివరించారు.