ఖలీద్ ఉమర్ అనే పాకిస్తానీ…సంస్కరణ వాది…
అలా అలా ఒక్కొక్క విషయం మన గురించి చెబుతుంటే…
ఆహా… చదవండి… చిన్నపాటి స్వేచ్ఛానువాదం…
సనాతన ధర్మం వారి దేవీ దేవతలను పూజించు కోవడంతో నింపబడిన జీవిత అభిరుచి నా హృదయాన్ని ముంచెత్తుతోంది.
కళ, వాస్తుశిల్పం, రంగులు, చైతన్యం, సృజనాత్మకత, కళాత్మకత, ఆనందం, ప్రసాదం… కలుపుకుపోవడం.
భగవంతుడు వివిధ రూపాల్లో .. వర్ణనలలో మానవ మనస్సుపై ఎటువంటి పరిమితి లేకుండా సృజించబడ్డాడు.
అది సహజంగా దాని తనదైన శైలిలో గొప్పగా నిర్మించుకుంటూ పోతుంది.
బహుదేవతారాధన అనేది అత్యంత ఉదారవాద సాధన అని నేను నమ్ముతున్నాను.
ప్రకృతి.. మానవ మెదడును.. బహుముఖీనంగా ఆలోచించే అత్యంత సామర్థ్యం గల అవయవంగా సృష్టించింది.
బహు దైవారాధన..
మానవ మెదడు దేనికి ఉద్దేశించబడిందో..దానిని ఆచరించడానికి అనుమతిస్తుంది!దేవుడు మానవులను సృష్టించాడు అనేది ఒక నమ్మకం అయితే..ఆ మానవుడు చాలా అందంగా తన కృతజ్ఞతను తిరిగి ఆ దేవుని పట్ల చూపడం కంటే గొప్ప దయ ఇంకేం ఉంటుంది.ఇది అన్వేషణకు.. విస్తారంగా.. నిరంతరంగా అన్వేషిస్తూ పోవడానికి మార్గాన్ని తెరుస్తుంది!
నా భారతీయ మిత్రులారా!
మీరు ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నారు. మీరు మీదైన మార్గంలో దైవత్వాన్ని సృష్టించడం. దాన్ని చర్చించడం…స్థాపించడం… ఆరాధించడం వంటి స్థిరమైన ఒక వ్యవస్థను ఏర్పరిచారు. ఎందుకంటే మీ గ్రంథాలు ఆ భగవంతునితో స్నేహం చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి…
మీరు అతనిని సుదూర నక్షత్రం వలె ఎంతగా ఆరాధిస్తారో…అంతకంటే ఎక్కువగా మీరు అతడిని స్వంత కుటుంబ సభ్యునిలా ప్రేమిస్తారు.మీ సంబరంలో నన్ను లెక్కపెట్టుకోండి సుమా..
ఇక్కడే నా మూలాలు ఉన్నాయి.. గుర్తింపు కూడా ఉంది.
వచ్చే తొమ్మిది రోజుల పాటు మీరు భగవంతుని కోసం పాడే భజనలు..కీర్తనలు..వాటి అర్థాన్ని నేను అంతఃలేఖనం చేస్తాను.ఇంత దూరం నుండి నేను యజ్ఞం మరియు హారతి యొక్క పవిత్ర జ్వాలలతో నా ఆత్మను శుద్ధి చేసుకుంటాను!అవరోధాలను తొలగించే గజముఖి గణేశుడి తత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
విఘ్నహర్త, ఏక దంత, పార్వతీపుత్ర, వక్రతుండ, గజముఖ, లంబోదర…ఇంకా మరెన్నో…
మీరు గణేశుడిని వందల పేర్లతో సంబోధిస్తారు…భగవంతుని పై మీకున్న ప్రేమ ఎంత స్వచ్ఛమైనది.అది ఎంతటి స్వేచ్ఛాయుత మైనది.అదే నన్ను ఎంతగానో ప్రేరేపిస్తున్నది…
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లౌడ్స్పీకర్లను ఆపడాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ., సనాతనులు మాత్రం … బెల్లం, విత్తనంతో మట్టి, కాగితపు గుజ్జు, బియ్యం పొడి, పసుపు పొడి మొదలైన వాటితో పర్యావరణ అనుకూలమైన గణేశ విగ్రహాలను నిర్మించడంపై దృష్టి సారిస్తున్నారు!
హిందూ దేవుళ్లు వారి అనుచరులకు ఆలోచించే స్వేచ్ఛను కల్పించారు. అయితే నేను & ls@m అనుచరులు 1400 సంవత్సరాల నుండి ఎడారి & గుహలపై గుడ్డి విశ్వాసాన్ని ఆశ్రయిస్తున్నాము.. దైవత్వం తన అనుచరుల నుండి బోన్సాయ్ వంటి పొట్టి వృక్షాలను ఎప్పుడూ తయారు చేయదు.
దైవత్వం తన అనుచరులను చాలా ఎత్తుకు విస్తరించి ఉన్న కొమ్మలతో మర్రి చెట్టులా పెద్దదిగా ఎదగడానికి అనుమతిస్తుంది.సనాతన ధర్మం…తన చుట్టూ ఉన్న వివిధ బోన్సాయిల మధ్య ఉన్న మర్రి చెట్టు.
భారతదేశానికి నమస్కారం!
సనాతన ధర్మానికి వందనం!
సనాతనీయులకు నమస్కారం!
మీరు కాంతిని వ్యాప్తి చేయరు; మీరే స్వయంగా ఒక కాంతి.
( వ్రాసిన వారు పాకిస్తాన్ కు చెందిన ఉమర్
తెలుగులోకి అనువాదం చేసిన వారు మంగళంపల్లి శ్రీహరి)