Suryaa.co.in

Telangana

ఇది బీజేపీ విజయం

-కేంద్ర నిర్ణయంతో దిగొచ్చి తెలంగాణ జాతీయ వజ్రోత్సవాల ప్రకటన
-చరిత్రను వక్రీకరించేందుకే జాతీయ సమైక్యతా దినోత్సవం
-దారుస్సలాం ఆదేశాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్
-రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
-టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ వంటి గుంట నక్క పార్టీలన్నీ ఏకమైనయ్
-తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి
-దేశద్రోహుల పార్టీలు కావాలా? దేశభక్తి పార్టీ కావాలో ఆలోచించండి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించడం బీజేపీ సాధించిన విజయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తరువాతే కేసీఆర్ ప్రభుత్వంసహా కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు వంటి గుంట నక్క పార్టీలన్నీ దిగొచ్చి ఐక్యతా రాగాన్ని విన్పిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని అనేక ఏళ్లుగా పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్నాళ్లూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేదో? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎం మెప్పుకోసం తెలంగాణ విమోచన చరిత్రనే వక్రీకరిస్తున్న కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తనను కలిసిన మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….

• సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణ విషయంలో అనేకసార్లు మాట మార్చిన వ్యక్తి సీఎం కేసీఆర్. తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి సీఎం రోశయ్యను తిట్టిన కేసీఆర్… తెలంగాణ వచ్చినంక మాట మార్చిండు. తెలంగాణ రాష్ట్రమే వచ్చినంక ఇంక విమోచన దినోత్సవాలెందుకన్నడు. ఇయాళ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయించగానే దిగొచ్చి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల పేరుతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైండు. తెలంగాణ విమోచన చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతోంది.

• దారుస్సలాం నుండి ఆదేశాలు వచ్చిన తరువాతే కేసీఆర్ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల జపం చేస్తున్నడు. కాంగ్రెస్ కూడా అదే జపం చేస్తోంది. గుంటనక్కలన్నీ ఈ విషయంలో ఏకమైనయ్. అందుకే కాళోజీ గుర్తుకొస్తున్నడు. స్థానికేతరుడు తప్పు చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలి. మనోడు తప్పు చేస్తే ఇక్కడే పాతిపెట్టాలన్నడు.

• తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్… ఇప్పుడెండుకు మాట మార్చి దారుస్సలాం చెప్పిన మాటను అమలు చేస్తున్నడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అట్లాగే బహిరంగ క్షమాపణ చెప్పాలి.

• తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలని చెబుతున్న కేసీఆర్ కు ఆనాడు సర్దార్ పటేల్ ’ఆపరేషన్ పోలో’ ఎందుకు నిర్వహించారో తెలియదా?

• ఒవైసీ అనే మూర్ఖుడికి సిగ్గుండాలి… ఆనాడు నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టు షోయబుల్లాఖాన్ చేతులు నరికిన దుర్మార్గుడు నిజాం గురించి ఏనాడైనా ఒక్క మాట మాట్లాడారా? తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతుకమ్మ ఆడిస్తే ఏనాడైనా స్పందించారా? ఏనాడైనా బైరాన్ పల్లి, నిర్మల్, పరకాల దురాగతాల గురించి నోరు విప్పారా?

• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించిన పార్టీ ఎంఐఎం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని పార్టీ ఎంఐఎం. రజకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పార్టీ ఆదేశాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు పాటిస్తున్నరంటే… కేసీఆర్ కు, ఆ గుంట నక్కల పార్టీలకు అసలు సిగ్గెందుకు లేదో అర్ధం కావడం లేదు?

• కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఒవైసీ చేతిలో ఏ విధంగా కీలుబొమ్మలా మారాయో తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆనాడు తెలంగాణ ప్రజలు పడుతున్న వెట్టి చాకిరి నుండి, బానిస బతుకుల నుండి విమోచనం కలిగించడానికే కదా ఆపరేషన్ పోలో నిర్వహించింది. వాటికేం సమాధానం చెబుతారు?

• కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని నిర్ణయిస్తే… ఈరోజు దిగొచ్చి తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల నిర్వహించాలని నిర్ణయించాయంటే ఇది ముమ్మాటికీ బీజేపీ సాధించిన విజయమే.

• ఓట్లు, సీట్ల కోసం తెలంగాణను దారుస్సలాంకు తాకట్టు పెట్టేందుకు వెనుకడానికి నీచులు కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు. ఇలాంటి దగుల్బాజీ పార్టీలకు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలి.

• నిజాం సమాధి ముందు మోకరిల్లిన దేశద్రోహుల పార్టీ కావాలా? సర్దార్ వల్లభాయి పటేల్ ఎదుట మోకరిల్లిన దేశభక్తి పార్టీ కావాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి.

LEAVE A RESPONSE